గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. రోజురోజుకూ ప్ర‌పంచ న‌గ‌రంగా ఎదుగుతున్న హైద‌రాబ‌ద్ మ‌హాన‌గ‌రం మాత్రం కీల‌క ర్యాంక్‌ను మాత్రం సాధించ‌లేక‌పోతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా  ప్రకటించిన గార్బేజ్‌ ఫ్రీ సిటీస్‌ ర్యాంకింగ్స్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరానికి స్థానం దక్కక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఫైవ్‌స్టార్‌ రేట్‌ ర్యాంకింగ్‌కు డాక్యుమెంటేషన్‌లో అర్హత సాధించినప్పటికీ  క్షేత్రస్థాయి పరిస్థితులతో ర్యాంకు లభించలేదు. స్వచ్ఛ‌ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్స్‌లో గార్బేజ్‌ ఫ్రీ సిటీ ర్యాంక్, ఓడీఎఫ్‌++ ర్యాంక్‌లు కూడా ప్రభావం చూపుతాయి.  ఓడీఎఫ్‌++కు ర్యాంక్‌కు 500 మార్కులు, గార్బేజ్‌ ఫ్రీసిటీకి వెయ్యి మార్కులు ఉన్నాయి. ఓడీఎఫ్‌++ ర్యాంక్‌ను సాధించినప్పటికీ గార్బేజ్‌ఫ్రీ సిటీ ర్యాంకింగ్స్‌లో మాత్రం జీహెచ్‌ఎంసీ ఫెయిలైంది.  ఈ ర్యాంకింగ్‌కు 25 ఇండికేటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలో ఎనిమిది ఇండికేటర్లు వార్డు స్థాయిల్లో అమలు చేసేవి. ఇందులో మూడింటిలో జీహెచ్‌ఎంసీ ఫెయిలైనందున ఎలాంటి ర్యాంక్‌ రాలేదని స‌మాచారం. డస్ట్‌బిన్‌ ఫ్రీ  కాక పోవడం.. నాలాల్లో చెత్త పేరుకుపోవడం, నూరు శాతం ప్లాస్టిక్‌ ఫ్రీ కాకపోవడంతో జీహెచ్‌ఎంసీ అర్హత సాధించ లేకపోయింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు షాక్ తిన్నారు.

 

జీహెచ్ఎంసీలో మొత్తం వార్డుల్లో ఏ ఒక్క వార్డులో ఏ ఒక్క అంశంలో ఫెయిలైనా ఆ ప్రభావం మొత్తం ర్యాంకింగ్‌పై పడుతుందని, గత సంవత్సరం టూ స్టార్‌ రేటింగ్‌కు అర్హత  పొందినా ఈసారి ఎలాంటి ర్యాంకింగ్‌ రాలేదని   సంబంధిత నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌కు మొత్తం 6వేల మార్కులు ఉండగా, గార్బేజ్‌ ఫ్రీకి సంబంధించిన వెయ్యి మార్కుల్లో ఎలాంటి మార్కులు రాకపోవడంతో ఇది స్వచ్ఛ ర్యాంకింగ్స్‌లోనూ ప్రభావం చూపనుంది. గత సంవత్సరం 350 మార్కులతో టూ స్టార్‌ ర్యాంకింగ్‌ పొందడాన్ని మననం చేసుకుంటు న్న జీహెచ్‌ఎంసీ డస్ట్‌బిన్‌ ఫ్రీ కాకపోవడమే తీ వ్ర ప్రభావం చూపిందని భావిస్తోంది.  ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించి  మొదటి, రెండో త్రైమాసికాల ఫలితాల్లోనూ జీహెచ్‌ఎంసీ ర్యాంక్‌ కిందికు దిగిపోవడం తెలిసిందే. మొదటి త్రైమాసికంలో 29వ ర్యాంకు, రెండో త్రైమాసికంలో 33వ ర్యాంకు లభించాయి.  గత మూడేళ్లుగా స్వచ్ఛ ర్యాంకింగ్‌లలో జీహెచ్‌ఎంసీ కిందకు దిగజారుతోంది. 2017లో 22వ ర్యాంక్‌ రాగా, 2018లో 27, 2019లో 35వ ర్యాంక్‌ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: