ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 57 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 2339కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 52 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 
 
ఢిల్లీ మర్కజ్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో కోయంబేడు మార్కెట్ లింకులు రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలో కోయంబేడు లింకుల వల్ల భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలలో ఎక్కువగా కోయంబేడు లింకుల వల్ల కరోనా కేసులు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో నిన్న 19 కేసులు నమోదయ్యాయి. 
 
జిల్లాలో 19 కేసులు నమోదు కాగా 17 కేసులు సూళ్లూరుపేటలోనే నమోదు కావడం గమనార్హం. నిన్న నమోదైన కేసులతో జిల్లాలో కేసుల సంఖ్య 183కు చేరింది. సూళ్లూరుపేటలో గత వారం రోజుల్లో 60 కేసులు నమోదయ్యాయి. మండలంలో 60 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. అధికారులు భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
సూళ్లూరుపేటలో భారీ స్థాయిలో ట్రూనాట్, ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులు కరోనా కేసులు నమోదైన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తున్నారు. జిల్లాలో అధికారులు 12 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 183 మందికి కరోనా నిర్ధారణ కాగా 801 మందికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు అందాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఈరోజు 68 కరోనా కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసులలో 10 కేసులకు కోయంబేడు లింక్ లు ఉన్నాయని సమాచారం. గత 24 గంటల్లో ఒకరు మృతి చెందటంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 53కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: