ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విభజనకు కారణం అయిందో, అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది. తెలంగాణాలో కాస్తో కూస్తో ఫర్వాలేదు అన్నట్లుగా ఉన్నా, ఏపీలో మాత్రం పూర్తిగా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ లో  బలమైన సీనియర్ నాయకులు అనుకున్న వారంతా ఏపీ తెలంగాణ విభజన తర్వాత పార్టీకి గుడ్ బాయ్ చెప్పేశారు. మిగిలి ఉన్న నాయకులు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినా, ఎక్కడా ఆ పార్టీకి డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఉందన్న  విషయాన్ని  ఏపీ ప్రజలు మర్చిపోయారు. అసలు ఇప్పట్లో ఆ పార్టీ పుంజుకుంటుందనే ఆశలు కాంగ్రెస్ హైకమాండ్ కు సైతం లేవు. అంతగా పార్టీ పరిస్థితి దిగజారింది. వచ్చే ఎన్నికల నాటికి కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. కానీ అటు టిడిపి వైసిపి లో చేరేందుకు అవకాశం లేని నాయకులు అంతా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నారు. 

 

IHG

 

పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేదని తెలిసినా, వారు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ముందు ముందు ఇదే విధంగా పరిస్థితులు ఉంటే తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డం అవుతుందనే భావనలో ఉన్న కొంతమంది నాయకులు ఇప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకుని ముందుకు వెళ్లాలనే విషయాన్ని ఇప్పుడు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మంత్రి శైలజనాథ్ ఏపీలో కాంగ్రెస్ కు మళ్లీ పునర్వైభవం రావాలంటే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే సూచనలు పార్టీ హైకమాండ్ ముందు ఉంచారట. దీనికి హైకమాండ్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ కు  అవకాశమే లేదు. అసలు తాను ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నది జగన్ అభిప్రాయం.

 

 దీంతో వారిని దరిదాపుల్లో కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మిగిలిందల్లా టిడిపి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్లిన చంద్రబాబుతో ఏపీలో పొత్తు పెట్టుకుంటే కాస్తో కూస్తో రాజకీయంగా ఉనికిలో ఉండొచ్చనేది కాంగ్రెస్ నాయకుల ఆలోచన. కుదిరితే ఇప్పటి నుంచే ప్రజా సమస్యల విషయంలో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజా, ఉద్యమాలు చేయాలని చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ఒప్పుకోకపోతే, వచ్చే ఎన్నికల నాటికైనా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు అయినా చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఆరాటపడుతున్నారు. వారి ఆశలు ఎంతవరకు తీరుతాయి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: