కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.ఈ విషయంలో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడుతోంది. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో తెలంగాణ రాజకీయ పక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటాము అంటూ ప్రకటించారు. అలాగే తెలంగాణ కు నష్టం చేకూర్చే ఏ చర్యను ఉపేక్షించబోము అంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు ఫిర్యాదు చేయగా, తెలంగాణ బిజెపి నాయకులు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కి గజేందర్ సింగ్ షెకావత్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయించుకుని దీని కోసం ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203 ను విడుదల చేసింది. ఈ జీవో పైన ఇప్పుడు రాద్ధాంతం జరుగుతుంది.

 

IHG


 ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి కృష్ణ రివర్ మేనేజ్మెంట్ నోటీసులు కూడా అందించి సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. తాజాగా  ఎన్జీటి ( నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ) పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ఎత్తిపోతలపై స్టే విధించింది. అలాగే ప్రాజెక్టు అధ్యయనానికి నాలుగు శాఖల సమన్వయంతో కేంద్ర కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కె.ఆర్ ఎంబి, కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్ ఐఐటీ నిపుణులను నియమించింది. ఈ కమిటీ రెండు నెలల్లో పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

 

IHG


అలాగే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి పనులు చేయవద్దు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే పోతిరెడ్డిపాడుతో తెలంగాణలో తాగు సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన జస్టిస్ రామకృష్ణ నేతృత్వంలోని బెంచ్ విచారించి విస్తరణ పనుల పై స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీటిని మళ్లించి  రాయలసీమ కు నీళ్లు అందించేలా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంతో పాటు, కుడి కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా పనులు చేపట్టడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 203 జారీ చేసింది.

 

 దీనికోసం ఏపీ ప్రభుత్వం 7 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టు ను ప్రతిపాదించింది. దీనిపైన తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపేయాలంటూ ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ను కోరింది. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ పనులపై స్టే విధించడంతో తాత్కాలికంగా ఏపీ తెలంగాణ మధ్య వివాదానికి తెర పడినట్లయింది. ఎన్జీటీ విధించిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పోతిరెడ్డిపాడు పాడు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: