డబ్బంటే ఎవ్వరికైనా ఎంత ఇష్టమో ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు.  దేవుడు మనిషిని సృష్టిస్తే.. మనిషి డబ్బును సృష్టించాడు.  కానీ ఆ భగవంతునికన్నా గొప్పదైంది ఈ డబ్బు... డబ్బు ఇప్పుడు మనిషిని ఆడిస్తుంది.  అలాంటి డబ్బు ఎవరికైనా దొరికితే కళ్లకు అద్దుకొని ఈ రోజు నా పంట పండింది.. దేవుడు నన్ను కరుణించాడని అనుకుంటారు.  అతి కొద్ది మంది మాత్రమే నిజాయితీ గా వ్యవహరించి ఎక్కువ డబ్బు దొరికితే పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తారు.  ఈ మద్య కరోనా వైరస్ ప్రబలిపోతుందని కొంత మంది రోడ్లపై పడ్డ డబ్బు కనీసం ముట్టుకోవడానికి కూడా భయపడిపోతున్నారు.  ఆ మద్య ఓ ఆటో డ్రైవర్ డబ్బు రోడ్డుపై పడితే.. తిరిగి అతనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెచుకున్నాడు.. ఎందుకంటే ఆ డబ్బు ఎవరూ ముట్టుకోకండా పోలీసులకు కబురు పెట్టారు.  

 

తాజాగా ఓ కుటుంబానికి డబ్బు దొరికింది.. అది వెయ్యో రెండు వేలు కాదు.. ఏకంగా రూ.75 లక్షలు. అవును అంత డబ్బు దొరికితే లైఫ్ టర్న్ అవుతుందని భావిస్తారు.. గుట్టు చప్పుడు కాకుండా నొక్కేస్తారు.  కానీ ఆ కుటుంబం మాత్రం పరుల సొమ్ము పాములాంటిదని భావించి నిజాయితీగా దాన్ని పోలీసులకు అప్పగించారు. ఆ డబ్బు ఎవరైనా పోగొట్టుకున్నారో.. కావాలనే పడేశారో తెలియకున్నా కూడా బాధ్యతగా వాటిని అధికారులకు అప్పగించారు. అమెరికాలోని వర్జీనియాలో ఇది చోటు చేసుకుంది. ఆ దంపతుల నిజాయతీ తెలిసిన పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

కరోలైన్‌ కౌంటీకి చెందిన డేవిడ్‌ అనే వ్యక్తి గత శనివారం తన ఫ్యామిలీతో కలిసి సరదాగా బయట వెళ్లారు.  ఆ సమయంలో వారికి రెండు బ్యాగులు దొరికాయి.. వాటిని తమ వాహనంలో వేసుకొని ఇంటికి చేరుకున్నారు. తీరా ఇంట్లో ఆ బ్యాగ్ లో చూస్తే కళ్లు చెదిరే డబ్బు. దీంతో ఎవరో పొగొట్టుకొని ఉంటారని భావించి పోలీసులకు విషయం చెప్పారు. వెంటనే వారు వచ్చి వాటిని స్వాధీనం చేసుకొని అవి ఎలా రోడ్డుపైకి వచ్చాయనే కోణంలో విచారణ ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: