చైనా మిత్రదేశాలు ఎప్పటికప్పుడు భారతదేశం పై తన అక్కసును వెళ్లగక్కుతూ... విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చైనా అండతో నేపాల్ ప్రధాని భారత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. భారత్ నేపాల్ కి సంబంధించిన భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది అంటు  విమర్శలకు దిగారు. నేపాల్లో మహమ్మారి కరోనా  వైరస్ వ్యాప్తికి భారత్ ను తప్పుబడుతుంది నేపాల్ ప్రభుత్వం. ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని కెపి వోలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం నుంచి వస్తున్న వైరస్ చైనా ఇటలీ దేశాల నుంచి వస్తున్న వైరస్ల కంటే ప్రమాదకరమైనది అంటూ నేపాల్ ప్రధాని కేపీ వోలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి నేపాల్ కి అక్రమ మార్గాల ద్వారా వస్తున్న వారు... నేపాల్ లో కరోనా  వైరస్ వ్యాప్తికి కారకులు అవుతున్నారు అంటూ నేపాల్ ప్రధాని ఓలి వ్యాఖ్యానించారు. 

 


 అయితే సరైన పరీక్షలు చేయకుండానే భారత్ నుంచి జనాలను నేపాల్ కి తీసుకొస్తున్నారు అంటూ ఆరోపణలు చేసిన ఓలి... కొంత మంది స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ పార్లమెంట్ వేదికగా ఆరోపణలు వినిపించారు. దేశంలో ఉన్న ప్రజల లో వైరస్ వ్యాప్తి చేయకుండా కంట్రోల్  చేయడం సాధ్యమవుతుంది అంటూ తెలిపిన ఓలి... బయటి నుంచి వస్తున్న వారితో ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేయడం మాత్రం ఎంతో ఇబ్బంది కరంగా మారిపోతుంది అంటు చెప్పుకొచ్చారు. ముక్యంగా  భారత్ నుంచి వస్తున్న వారి ద్వారా వ్యాపిస్తున్న కరోనా  వైరస్ ఎంతో ప్రమాదకరమైనది  అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రస్తుతం భారత భూభాగంలో ఉన్న కాలాపాని లిపియదురా,  లిపూలెక్  ప్రాంతాలు నేపాల్ దేశానికి చెందినవి అంటూ పార్లమెంటు వేదికగా ఆరోపణలు చేశారు. 

 

 త్వరలో భారత్ నుంచి తమ దేశానికి చెందిన ప్రాంతాలను తాము స్వాధీనం చేసుకుంటామని అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే తాజాగా భారత దేశంలో ఉన్న ప్రాంతాలను నేపాల్ మ్యాప్ లో చూపిస్తూ ఒక మ్యాప్ ని విడుదల చేసింది నేపాల్ సర్కార్ . కాలాపాని లిబియాదురా  ప్రాంతాల నేపాల్కు చెందిన అయినప్పటికీ అక్కడ భారత సైన్యం మొహరించి ఉంటుంది అంటూ నేపాల్ ప్రభుత్వం వాదించింది. ఇక తమ దేశానికి చెందిన భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు త్వరలోనే చర్యలు చేపడతామని తెలిపారు నేపాల్ ప్రధాని వోలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: