'పోకిరి' సినిమాలో ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా తెలుగు రాజకీయాలలో జగన్ వ్యవహారం ఉంది. ముందు నుండి రాజకీయాలలో జగన్ మొండి వాడని అందరికీ తెలిసిందే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, పంతం నెగ్గించుకోవడానికి ఎంత దూరమైనా జగన్ వెళ్తాడని, ఆయన సన్నిహితులు వైసీపీ పార్టీలో సీనియర్ నాయకులు అంటుంటారు. అటువంటిది తాజాగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పెంపుదల విషయంలో ఒకపక్క తెలంగాణ సర్కార్ పోరాడటానికి రెడీ అంటుంది. కానీ జగన్ మాత్రం తెలంగాణ సర్కారు చేసిన వ్యాఖ్యలను కూరలో కరివేపాకులా పక్కన పెట్టేస్తూ ముందుకు సాగుతున్నారు.

 

ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో టెండర్లు పిలవడానికి జగన్ సర్కార్ ప్రక్రియ ఆరంభించింది. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను ఖరారు చేయాలని జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్లు సమాచారం. మొత్తంగా ప్రాజెక్ట్ వ్యయం.. రూ.6,829.15 కోట్లు. సంగమేశ్వరం వద్ద నిర్మించే ఎత్తిపోతల పథకంతో పాటు కాలువల విస్తరణ కూడ ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నిధులకు పాలనామోదం ఇచ్చారు. మొత్తం రెండు ప్యాకేజీలుగా విడగొట్టి టెండర్లు పిలవాలని నిర్ణయించారు.

 

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయమై కేసీఆర్ సర్కార్ కృష్ణా జలాల బయటికి ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రంగంలోకి దింపాలని ఆలోచన చేస్తుంది. కానీ జగన్ మాత్రం ఎవర్నీ పట్టించుకోకుండా కారులో లాస్ట్ గేర్ వేసినట్టు దూకుడుగా స్పీడ్ గా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ కాదు మోడీ వచ్చిన ప్రాజెక్టు ఆపే పరిస్థితి లేదు అన్నట్టుగా జగన్ మంచి స్పీడ్ పనుల్ల మీద దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువు సీమగా ఉన్న రాయలసీమ దశ మారిపోతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాగైనా త్వరగా కంప్లీట్ చేయాలని జగన్ పగడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: