కరోనా వైరస్ కారణంగా చైనా ఒంటరై పోతోంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే చైనా రాయబారి ఆసక్తికరమైన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం పారిశ్రామిక ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని, భారత్‌ స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చైనా రాయబారి పేర్కొనడం గమనార్హం. కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌ నగరం కేంద్రంగా బయటపడిన విషయం తెలిసిందే. చూస్తుండగానే ఈ వైరస్ ప్రపంచాన్ని చుట్టేసి అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వైరస్ బారినపడి మృతి చెందారు. సుమారు అర‌కోటిమంది వైర‌స్‌బారిన‌ప‌డ్డారు. ప్రధానంగా చైనాతోపాటు యూర‌ప్ దేశాల్లోనే కాకుండా అమెరికా, భార‌త్ త‌దిత‌ర దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది. అయితే ఈ వైరస్ గురించి బయట ప్రపంచానికి చెప్పకుండా చైనా కావాలనే దాచి ఉంచింద‌ని, దాని ఫలితంగానే నేడు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయని అమెరికా అనేక దేశాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

 

ఇక ఈ నేపథ్యంలో చైనాలో ఉన్న విదేశీ కంపెనీలు బయటకు వస్తున్నాయి. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా అనేక కంపెనీలు భారత్‌కు వస్తున్నాయి. ఇందుకు భార‌త్‌కు కూడా సానుకూలంగానే ఉంది. విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్శించి, ఇక్క‌డ ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌ను పెంపొందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇక ఒంటరై పోతున్న చైనా భార‌త్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత్ వృద్ధి సాధించేందుకు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చైనా చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వార్షిక స‌మావేశంలోనూ దాదాపుగా 70దేశాలు చైనాపై ఆరోప‌ణ‌లు గుప్పించాయి. క‌రోనా వైర‌స్ పుట్టుక‌, వ్యాప్తిపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశాయి. ఈ మేర‌కు ప‌రిస్థితుల‌న్నీ కూడా అదుపులోకి వ‌చ్చాక తాము కూడా ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రిస్తామ‌ని చైనా చెప్పిన విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: