క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య ఇది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ఎన్నో కుటుంబాలు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నాయి. మొద‌ట‌ చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. అనాతి కాలంలోనే అన్ని దేశాలు వ్యాప్తిచెంది ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. . చాలా దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారికి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 50 లక్షల చేరువలో ఉన్నాయి. అమెరికా సహా పలు దేశాల్లో ఉధృతి అలాగే కొనసాగుతోంది. 

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ప్రపంచవ్యాప్తంగా క‌రోనా కాటుకు బ‌లైపోయిన వారి సంఖ్య 3 ల‌క్ష‌లు దాటేసింది. అయితే కరోనా బారిన పడిన వృద్ధులు ప్రాణాలతో బట్టకట్టడం కాస్త కష్టమైన విషయమే అయిన‌ప్ప‌టికీ.. అక్కడక్కడ కొంత వృద్ధులు కరోనాను జయించారు. అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ్రీస్‌కు చెందిన సోఫీ అవోరిస్ న్యూయార్క్‌లోని మన్ హాట్టన్‌లో నివసిస్తోంది. సోఫీ మార్చి నెలలో హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకుంది. అయితే అదే టైమ్‌లో ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే కరోనా పాజిటివ్ అని తేలడంతో.. సోఫీ కుటుంబసభ్యులకు తెలిపారు. అలాగే వెంటనే వైద్యులు ఆమెను ప్రత్యేక వార్డుకు తీసుకెళ్లి చికిత్స ప్రారంభించారు.

 

ఇక‌ కరోనా సోకిన తరువాత తన తల్లిని చూసేందుకు కూడా వైద్యులు నిరాకరించారని సోఫీ కూతురు ఐఫీ తెలిపింది. పరిస్థితి చేయి దాటితే చివరిచూపు చూసుకునేందుకు అనుమతిస్తామని వైద్యులు తమతో చెప్పినట్టు ఐఫీ పేర్కొంది. కానీ, విచిత్రం ఏంటంటే.. సోఫీ కేవలం రెండు వారాల్లోనే తిరిగి కోలుకున్నారు. అయినప్పటికీ వయసు రిత్యా ఆరు వారాలు పరీక్షలు జరిపగా.. ప్రతిసారి నెగిటివ్ అని రిపోర్టులు వచ్చాయి. దీంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. కరోనా సోకినా సోఫీ ఎక్కడా ఆందోళ చెందలేదని, అందుకే త్వరగా కోలుకోగలిగారని వైద్యులు వెల్ల‌డించారు. ఏదేమైనా.. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సోఫీని చూస్తుంటే క‌రోనాను ఈజీగా గెల‌వ‌చ్చ‌న్న న‌మ్మ‌కం వ‌స్తోంది.
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: