ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ప్రజా సంక్షేమ పాలన అందించారు. 12 నెలల పరిపాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ప్రజలు ప్రయోజనం చేకూరేలా ఎన్నో సంచలన, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఐదు రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. 
 
 
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్ర ప్రగతిపై ఈ నెల 25 నుంచి సీఎం జగన్ తో మేధో మదన సమీక్ష కార్యక్రమం జరగనుందని తెలిపారు. ఈరోజు మంత్రి రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మాట్లాడుతూ విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంపై అధికారులకు సూచనలు చేశారు. 
 
రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై మేధోమదనంలో ఐదురోజుల పాటు ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేయనున్నారని తెలిపారు. గడచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాల గురించి ప్రధానంగా సమావేశాల్లో చర్చ జరగనుందని తెలుస్తోంది. మేధో మదనం కార్యక్రమం మొత్తం 5 రోజులు జరగనుందని... తొలి రోజున వ్యవసాయం, రెండవ రోజున విద్యాశాఖ, మూడో రోజున వైద్యఆరోగ్యశాఖ, నాల్గవ రోజున గ్రామ –వార్డు వాలంటరీ వ్యవస్థ, చివరి రోజున ప్రణాళిక విభాగం గురించి సమీక్ష సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. మరోవైపు సీఎం జగన్ నిన్న మేనిఫెస్టో క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ నెల నుంచి ఆగష్టు నెల చివరి వారం వరకు ఏ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో తేదీలను ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: