ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి ఏ విధంగా భయపెడుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఓ వైపు కరోనాతోనే నానా కష్టాలు పడుతుంటే.. ఇప్పుడు అంఫన్ తుఫాన్ మరో భయాన్ని సృష్టిస్తుంది.  మొన్నామద్య వైజాగ్ లో గ్యాస్ లీక్.. ఢిల్లీలో భూకంపం.. ప్రకృతి 2020 లో కకావికలం చేస్తుందా అన్నంత భయం కల్పిస్తుంది.  ఈ నేపథ్యంలో ఇప్పుడు బెంగుళూరు లో వింత వింత భయంకరమైన శబ్ధాలు రావడంతో ఒక్కసారిగా జనాలు భయాందోళనకు గురయ్యారు.  బుధవారం మధ్యాహ్నం సర్జాపూర్, వైట్ ఫీల్డ్, హెబ్బాల్, హెచ్ఎస్ఆర్ తదితర ప్రాంతాల్లో వింత శబ్దాలు వినిపించాయి.  స్థానిక ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. కొందరు భూకంపం వచ్చిందేమోనని అనుమానించారు. మరికొందరు ఫైటర్ జెట్ విమానాలు వెళ్లడం వల్ల ఈ భారీ శబ్దాలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.

 

అయితే, ఆ శబ్దాలు భూకంపం వల్ల వచ్చినవి కావని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ స్పష్టం చేసింది. అంతే కాదు సెస్మో మీటర్లలో భూప్రకంపనలేవీ నమోదు కాలేదని కేఎస్ఎన్ఎండీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  దాంతో ప్రజలు ఇది పెద్ద ప్రమాదం ఏదీ కాదని ఊపిరి పీల్చుకున్నారు.. కానీ అసలు ఇది ఎక్కడ నుంచి వచ్చిన శబ్ధాలు అన్న విషయం మాత్రం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఇక కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి.

 

గత ఆరు రోజుల్లో నమోదైన కేసుల్లో ఎక్కువశాతం మహారాష్ట్ర నుంచి వచ్చినవారికే రికార్డవుతోంది. రాష్టంలో కేసుల్లో అది 57 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మే 14 నుంచి మే 19వ తేదీ వరకు 414 కేసులు నమోదు కాగా.. వీరిలో 57.25 శాతం అంటే 237 మంది మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారేనని అధికారులు చెబుతున్నారు.  41 మరణాల్లో ఒకటి మాత్రం కోవిద్-19తో సంబంధం లేదని పేర్కొంది. కర్ణాటకలో లాక్‌డౌన్ నిబంధనలను భారీగా సడలించడంతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: