దేశంలో కరోనా వైరస్ వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇండియాలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభించింది. వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత, తొలిసారిగా, 24 గంటల వ్యవధిలో 5,600కు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 5,611 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇదే సమయంలో 140 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకూ 3,303 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. నిన్న 3,124 మంది రికవరీ కాగా, మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 42,297కు పెరిగింది. రికవరీ రేటు 39.62 శాతానికి మెరుగుపడింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి పెరిగాయని, ప్రస్తుతం 61,149 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని పేర్కొంది.

 

ఇక కరోనా వైరస్ భారి పడ్డవారి పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు బాధితులు. కరోనా బాధితులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెల్సిందే. అక్కడ వాళ్లకు శాకాహారం మాత్రమే ఇస్తున్నారు.   క్వారంటైన్ లో పద్నాలు రోజులు ఉండటం కత్తి మీద సాము అని.. అందరినీ వదిలి  ఐసోలేషన్ గదిలో గడపడం చాలా కష్టం అని అంటున్నారు.  అయితే ఇక్కడ ఉండేవారి మెను విషయంలో ప్రభుత్వాలు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  తాజాగా ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కి  తందూరి చికెన్ ఆర్డర్ వచ్చింది.

 

ఆర్డర్ తీసుకొని ఆ డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు.  ఫోన్ లో చూపిస్తున్న లొకేషన్ ప్రకారం ఐసోలేషన్ గదిలోకి వెళ్లబోయాడు.  అక్కడ ఉన్న వార్డు బాయ్ చూసి అన్ని ఆపి ఇది ఐసోలేషన్ వార్డు అని.. ఇక్కడ కరోనా పేషెంట్స్ ఉన్నారని చప్పగానే ఖంగు తిన్నాడు.  సెక్యూరిటీ గార్డు వెంటనే ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు రంగంలోకి దిగారు. ఆర్డర్ చేసిన వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: