ఏపీ సీఎం జ‌గ‌న్ ఎంతటి మొండి ఘ‌ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జ‌గ‌న్ మొండికే పెద్ద జ‌గ‌మొండి అని నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు సైతం ఒప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే సీఎం అయిన యేడాది కాలంలోనే జ‌గ‌న్ చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు... పాల‌నా ప‌రంగా దూకుడుగా తీసుకుంటోన్న నిర్ణ‌యాలు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లోనే కాదు.. యావ‌త్ దేశ వ్యాప్తంగా ఎంతో మంది ముఖ్య‌మంత్రులు... ఆయా రాష్ట్రాల అధికారులు.... ఉన్న‌త విద్యావంతుల‌ను ఆలోచింప చేస్తున్నాయి. 

 

చివ‌ర‌కు జ‌గ‌న్ను గ‌తంలో ఓ రేంజ్‌లో టార్గెట్ చేసిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సైతం సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కులు మేనిఫొస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెర‌వేర్చ‌కుండా కాల‌యాప‌న చేస్తుంటార‌ని.. కానీ జ‌గ‌న్ మాత్రం ఇవ్వ‌ని హామీల‌ను కూడా నెర‌వేరుస్తున్నారంటూ ఆకాశానికి ఎత్తేసిన సంగ‌తి తెలిసిందే. ఇక విశాఖ గ్యాస్ ప్ర‌మాదం విష‌యాన్ని కేవ‌లం రెండే రెండు రోజుల్లో జ‌గ‌న్ ఫినిష్ చేయ‌డం మామూలు విష‌యం కాదు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోన్న తీరు... ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా ప్ర‌జ‌ల ముగింట్లోకే సంక్షేమం వెళుతోన్న తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు.

 

అస‌లు దేశంలో ఇప్పుడున్న ముఖ్య‌మంత్రులే కాకుండా.. గ‌తంలో కూడా ఈ త‌ర‌హాలో పాల‌న‌ చేసిన ముఖ్య‌మంత్రులు ఎవ్వ‌రూ లేర‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లే మెచ్చుకుంటోన్న ప‌రిస్థితి. ఇక ఎవ‌రికి అయినా ప‌రిహారం ఇచ్చే విష‌యంలో కాని.. ఇటు పాల‌న‌లోనూ.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అమ‌లు చేసే అంశంలో కాని జ‌గ‌న్ చూపిస్తోన్న తెగువుకు అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఇక క‌రోనా విష‌యంలో మ‌నం భ‌విష్య‌త్తులో క‌రోనాతో క‌లిసి ప్ర‌యాణం చేయ‌క త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని చాలా మంది విమ‌ర్శించారు. చివ‌ర‌కు అదే నిజ‌మైంది.. ఇప్పుడు ఇత‌ర రాష్ట్రాల సీఎంల‌తో పాటు ప్ర‌ధాన‌మంంత్రి మోదీ సైతం జ‌గ‌న్ నిర్ణ‌యానికి జై కొట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఏదేమైనా జ‌గ‌న్ తెగువు.. ముందు చూపున‌కు ఇప్పుడు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: