ఒకవైపు దేశమంతటా కరోనా మహమ్మారి విరుచుకుపడుతూ ఉంటే.. మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఈ తరుణంలోనే తన భార్య ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంతో ఆ యువకుడిని గొడ్డలితో నరికి చంపాడు ఒక యువకుడు. ఈ దారుణమైన సంఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట శివార్లలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బేగంపేటకు చెందిన రాజేందర్ ఉపాధి హామీ పథకంలో మెట్ గా విధులు నిర్వహించే వాడు. అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు రమేష్, మహేష్ ఉపాధి నిమిత్తం చాలాకాలంగా గల్ఫ్ లో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్న రమేష్ భార్యతో రాజేందర్ అక్రమ సంబంధం కొనసాగించడం జరిగింది.ఇక రమేష్ భార్య కూడా అడ్డు లేకపోవడంతో రాజేందర్ తో ఇష్టమొచ్చినట్లు తిరిగేది. ఇటీవలే రమేష్, మహేష్ ఇద్దరూ గల్ఫ్ నుంచి తిరిగి రావడంతో వీరి ఇద్దరి బంధానికి అడ్డుగా నిలిచారు. 

 


ఇది ఇలా ఉండగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా రమేష్ తో నీ భార్య రాజేందర్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది, ఇద్దరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారు అతడు రోజు ఇంటికి వచ్చి వెళుతుంటాడు అని తెలియజేశారు.. దీనితో రమేష్ రాజేందర్ పై కోపం పెంచుకోవడం జరిగింది. ఇక మార్చి 3న అన్నదమ్ములు ఇద్దరూ కలిసి మెట్ పల్లి శివార్లలో పెట్రోల్ బంక్ వద్ద రాజేంద్ర హత్యా ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై అధికారులు కేసు నమోదు చేసి అన్నదమ్ములు ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇక వీరిద్దరూ నెల రోజుల కిందట బెయిల్ పై బయటికి వచ్చారు. దీనితో రాజేంద్ర పై మరింత పగతో ఉన్నారు వారి ఇద్దరు. ఇక రాజేందర్ ను మళ్లీ హత్య చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

 


ఇక గ్రామ శివార్లలో బాగు బోరు ప్రాంతంలో మెట్ పల్లి వేంపేట మార్గంలో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజేంద్ర తన తల్లి అక్కడ కూలీకి వెళుతున్నారు. కూలి పని పూర్తి అయిన తర్వాత రాజేంద్ర తన తల్లిని ఇంటివద్ద దింపేసి ఈ ప్రదేశానికి రావడం జరిగింది. కదలికలు అన్ని గమనించిన అన్నదమ్ములు ఇద్దరూ రాజేంద్ర పై గొడ్డలితో ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. ఇక రాజేందర్ ను విచక్షణారహితంగా నరకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఇక స్థానికులు ఈ ఘటన విషయం పై పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. స్థలానికి పోలీస్ అధికారులు చేరుకొని పోస్టుమార్టం నిర్వహించేందుకు మేట పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: