మ‌రోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్‌కు మూటలు మోసింది కూడా కేసీఆరే అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకున్నదీ కేసీఆరే అని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగం రంగారెడ్డి ఎమ్మెల్సీ కోసం ఎమ్మెల్యేలను కేసీఆర్‌ అమ్ముకున్నారని, సీఎం అయ్యాక ఏం చేశారో కేసీఆర్‌ చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ సర్కార్‌లో మాటలు తప్ప చేతలు లేవని.. కరోనా నిర్మూలనలో కేసీఆర్‌ను‌ ఐసీఎంఆర్ ప్రశంసించిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని నారాయణరెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెస్ట్‌ల సంఖ్య తక్కువగా ఉందని, కేసీఆర్‌ తన ప్రభుత్వాన్ని మోనోపాలిజంతో నడుపుతున్నారని గూడూరు నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా అధికార టీఆర్ఎస్‌, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే.

 

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ విఫ‌లం చెందార‌ని, త‌క్కువ‌గా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత‌లు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత హ‌నుమంత‌రావు కూడా ఏకంగా దీక్ష కూడా చేప‌ట్టారు. ఇదే స‌మ‌యంలో ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌లు విలేక‌రుల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పేందుకు కూడా ఆయ‌న ఇష్ట‌ప‌డ‌లేదు. వాళ్ల మాట‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. వాళ్ల‌వి అర్థంప‌ర్థం లేని విమ‌ర్శ‌ల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎద్దేవ చేశారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మ‌రింత ఘాటుగా స్పందించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. నిజానికి.. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై ఈస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ఇదే మొద‌టిసారి కాదు.. గ‌తంలోనూ అనేక‌మార్లు ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: