జగన్..కేసీయార్ ఈ మధ్య రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలతో సంబంధాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అన్నదమ్ములు మాదిరిగా ఇప్పటిదాకా ఉంటూ వచ్చిన  ఈ ఇద్దరు నేతల మధ్య విభేధాలు కూడా ఇపుడు  తారస్థాయిలో ఉంటాయా. ఉంటే ఏం జరుగుతుంది, ఎవరు విజేతలు, ఎవరు ఎవరి మీద పై చేయి సాధిస్తారు. ఇవన్నీ ప్రశ్నలే.

 

అయితే ఈ మధ్య కేసీయార్ ఏకంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటి అన్న మాట వాడారు. అంతే కాదు, రాయలసీమలో ఉన్న వాళ్ళు మాత్రం ప్రజలు కాదా అంటూ మానవత్వంతో కూడా పదాలను వాడారు. రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీలు లేవు. ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందామనే అపుడూ ఇపుడూ ఎపుడూ చెబుతానని  కూడా అన్నారు.

 

గోదావరి మిగులు జలాలు ఏపీకి  తీసుకుపోమని కూడా తాను చెప్పానని కూడా కేసీయార్ చెప్పారు. గోదావరి జలాలు అయితే ఎక్కువ మొత్తంలో సముద్రంలో కలుస్తున్నాయని వాటికి పూర్తిగా వాడుకోవాలని కూడా ఏపీ సర్కార్ కి సూచించినట్లుగా కూడా కేసీయార్ చెప్పారు. ఇవన్నీ విన్నపుడు కచ్చితంగా జగన్ తో  కేసీయార్ కి స్నేహబంధం ఉందని అనిపిస్తుంది. అది ఎక్కడికీ పోలేదనిపిస్తుంది.

 

ఇపుడు దానికి మరింత ప్రాధాన్యతను ఇచ్చేలా ఒక వార్త ప్రచారంలో ఉంది. జూన్ నెలలో కేసీయార్, జగన్ ఇద్దరూ కలుసుకుంటారని, ఈ భేటీలో జల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. కేసీయార్ జగన్ భేటీలో ప్రధానంగా పోతిరెడ్డిపాడు అంశమే చర్చగా ఉండబోతోంది అంటున్నారు. కేసీయార్ జగన్ కూర్చుంటే దీనికి చక్కని పరిష్కారం దొరుకుతుందని కూడా అంటున్నారు.

 

ఇప్పటికి కేసీయార్ జగన్ నాలుగు సార్లు  భేటీ అయ్యారు. అన్ని భేటీలు విభజన చట్టంలోని అంశాలను చర్చించడంతో పాటు, నీటి సమస్యలపైన కూడా ఇద్దరూ సీఎంలు చర్చించారు. కానీ ఇపుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడి బాగా ఉంది. ఈ టైంలో కనుక భేటీ అంటూ జరిగితే అది హైలెట్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: