ఆశ్రమం అంటే అనాధలకు దేవాలయం వంటిది.. కానీ ఈ ఆశ్రమాలను కొందరు అడ్దమైన పనులకు నిలయంగా మారుస్తున్నారు.. సమాజంలో గొప్పవారుగా, సంఘసేవకులుగా చలామని అవుతూ, మంచితనం ముసుగులో ఎన్నో అక్రమాలను నిర్వహిస్తున్నారు.. నిజానికి బయటకు అనాధలకు నీడనిచ్చే వృక్షాలుగా కనబడుతున్న ఆశ్రమాల్లో జరగని అవినీతి పనులంటు లేవన్న విషయం అందరికి తెలిసిందే.. కాని ఇలాంటి చీకటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చేది చాలా తక్కువ.. నిజమైన సేవకుడు నిస్వార్ధంగా సహాయం చేస్తాడు.. స్వార్ధంతో సేవచాటున చేసే ద్రోహానికి ఎప్పుడో ఒకప్పుడు తగిన శిక్షను అనుభవించవలసిందే..

 

 

ఇకపోతే మహారాష్ట్ర పోలీసులు ఆశ్రమం పేరుతో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ గుట్కా దందాను ఛేదించారు. ఇందులో భాగంగా రూ.7 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను తెలుసుకుంటే.. జల్నా జిల్లాలోని రోహిలగడ్ గ్రామంలో ఉన్న ఓ ఆశ్రమంలో అక్రమంగా గుట్కా నిల్వచేసి పంపిణీ చేస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆ ఆశ్రమంలో రూ.7 లక్షల విలువైన 46 గుట్కా బ్యాగులను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని అంబడ్ పోలీస్టేషన్ ఇంచార్జ్ అనిరుద్ నందేడ్కర్ పేర్కొన్నారు. ఇకపోతే గుట్కా దందా వెనుక ఆ ఆశ్రమ నిర్వాహకుడిదే ప్రధాన పాత్ర ఉందని భావిస్తున్న పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. అంతే కాకుండా ఈ వ్యవహారం వెనక ఎవరెవరి హస్తం ఉందో కూపీ లాగుతున్నారట..

 

 

మరి ఈ వ్యవహారం వెలుగులోకి వస్తుందో, పెద్దవారి చేతులు పడి చీకట్లో కలిసిపోతుందో చూడాలి.. ఇకపోతే ఇలాంటి అక్రమార్జన, అవినీతి పనులు ఆశ్రమాల్లో జరగడం కొత్తేమి కాదు. ఇది నలుగురికి తెలిసింది కాబట్టి తప్పు అంటున్నారు.. ఇలాంటి తప్పులు బయటకు పొక్కకుండా ఎన్ని ఘోరాలు, నేరాలు, దారుణాలు తోడేళ్ల ముసుగు వేసుకున్న ఆశ్రమాల్లో జరగడం లేదు.. మన వ్యవస్ధ మంచిదై నిజాయితీగా జీవించాలని, నిస్వార్ధంగా నలుగురికి సాహయం చేయాలనే ఆలోచన మనుషుల్లో రానంత వరకు ఎవరి జీవితాలు మారవు. చట్టాలు ఎన్ని వచ్చిన దోషులు శిక్షించబడరని కడుపుకాలిన కొందరు అనుకుంటున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: