ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ సర్కార్ పై  తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పలు ఆరోపణలు చేస్తూ ఉంటారు టిడిపి జాతీయ కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్. అయితే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడిన మాటల్లో మంచి పాయింట్ కి  తెరమీదకు తీసుకువచ్చారు నారా లోకేష్. ఇంతకీ వ్యవసాయ మంత్రి కన్నబాబు ఏం ప్రకటన చేశారు అంటే... కర్ణాటక తెలంగాణ లలో  ఇప్పటికే మార్కెట్లో జరుగుతున్నాయని... తాజా పండ్లు కూరగాయలు వంటివి వినియోగదారుల ఇళ్లకే డెలివరి చేస్తున్నామని.... అయితే రైతులకు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ ఉండకూడదు అనే ఉద్దేశంతో జగన్ సర్కార్ ఉద్యానవన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఇప్పటివరకు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల పంటను కొనుగోలు చేసాము అంటూ చెప్పుకొచ్చింది

 

 కాగా మంత్రి కన్నబాబు వ్యాఖ్యల్లో  కీలక  పాయింట్ ను తెరమీదకి తెస్తూ పలు ఆరోపణలు చేశారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో బెటర్ అంటూ వ్యాఖ్యానించారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో అన్ని పంటలూ కలిపి 6, 17, 032 మెట్రిక్    టన్నుల దిగుబడి ఉంటే... ప్రభుత్వం కేవలం పదో వంతు మాత్రమే కొనుగోలు చేసింది. తెలంగాణలో మొత్తం రైతులు పండించిన పంటకు ఐదువేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కేవలం వెయ్యి కోట్ల మేర మాత్రమే  రైతుల నుంచి పంట కొనుగోలు చేశారు అంటూ ఆరోపించారు. ఇక్కడ 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే ప్రభుత్వం కనీసం అయిదో వంతు కూడా కొన లేదని ఆరోపించారు. 

 


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు కూడా అరకొరగానే ఉన్నాయి అంటూ తెలిపారు నారా లోకేష్. ప్రస్తుతం రైతులు పండించిన పంటకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లభించడం లేదు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక మొక్కజొన్న పంట పరిస్థితి దారుణంగా ఉందని... గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దారుణంగా మొక్కజొన్న పంట ధర పడిపోయింది అంటూ తెలిపారు. అయితే దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే దళారీ వ్యవస్థ వలన లేదా ఇంకేదైనా కారణం వల్ల ఏర్పడిన లోపమా అన్నది  ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: