కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి చైనా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్న  విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ల్యాబ్ లో తయారు చేసి ప్రపంచ దేశాల నాశనానికి చైనా ప్రయత్నాలు చేసేందుకు ప్రయత్నిస్తుంది అంటు అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలు చైనా దేశం పై ఆరోపణలు చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసిన చైనా మాత్రం ఎక్కడ స్పందించకుండా తన పని తాను చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలకు కారణం కూడా లేకపోలేదు.. మొదట ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది చైనాలోని వుహాన్  నగరంలో అన్న  విషయం తెలిసింది. వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చైనా మొత్తం పాకుతూ  పోయింది ఈ మహమ్మారి వైరస్. 

 


 70 వేల వరకు పాకిపోయింది.. ఎంతగానో మరణాలు కూడా సంభవించాయి . చైనా మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇలాంటి సమయంలో చైనాలో మరింత దారుణ పరిస్థితులు చూడాల్సి వస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో... చైనాలో ఒక్కసారిగా కరోనా కేసులు తగ్గిపోయాయి. కనీసం రోజులు పది లోపలే కేసులు రావడం మొదలైంది. దీంతో  ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఈ క్రమంలోనే అనుమానంతో దర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు దేశాల వైద్య బృందాలు నిర్ణయించాయి.. అయితే మొదట్లో చైనా ఈ దర్యాప్తు అంగీకరించకపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం అంగీకరించాల్సి వచ్చింది. 

 


 ఈ నేపథ్యంలో ప్రపంచ నిపుణుల బృందాల చైనాలో పరిశోధనలు జరపడానికి కరోనా మూలలను  కనుగొనడానికి  సిద్ధమవుతున్న తరుణంలో తాజాగా చైనా మరో నాటకానికి తెర లేపింది. చైనాలో తాజాగా 34 కొత్త కేసులు వచ్చాయంటూ  చైనా తెలిపింది . ఇద వుహాన్ నగరం నుంచి వచ్చిన వార్త అయినప్పటికీ కరోనా వైరస్ కేసులు వచ్చినవి... జిలిన్  ప్రావిన్స్లో ఈ కేసులో వచ్చిన చెబుతుంది  చైనా. సాధారణ పరిస్థితులు రాబోతున్నాయి అనుకుంటున్న తరుణంలో మరోసారి కరోనా పెరుగుతుంది అంటూ చెప్పింది. మళ్లీలాక్ డౌన్  విధించబోతున్నాము అంటూ తెలిపింది.అయితే కరోనా  వైరస్  అక్కడ వ్యాప్తిచెందుతుంది అంటే అటు నిపుణుల బృందం కూడా అక్కడకు వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి నాటకాలు ఆడుతోందని చైనా  పై విమర్శలు చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: