ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించనున్నామని ప్రసంగంలో తెలిపారు. ఈ ప్రకటన విన్న వెంటనే ప్రజలు కేంద్రం నుంచి ఎంతో కొంత నగదు ప్రత్యక్షంగా అందే అవకాశం ఉందని... లాక్ డౌన్ కష్టాలు కొంతవరకైనా తీరే అవకాశం ఉందని భావించారు. కానీ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదని సామాన్యులు, పేదల నుండి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 
 
తాజాగా మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ గురించి స్పందించారు. ఈ ప్యాకేజీ ద్వారా ప్రజలకు దక్కేది కేవలం లక్షా 86 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని అన్నారు. మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ అని నిలదీశారు ప్రభుత్వం చెబుతున్న ప్యాకేజీ పూర్తిగా అబద్ధమని వ్యాఖ్యలు చేశారు. అబద్దాలతో మభ్యపెట్టి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రధాని ఎత్తుగడలు వేస్తున్నారని తెలిపారు. 
 
ప్రభుత్వం నిజంగా 20 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని అన్నారు. మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అవాస్తవం అని అన్నారు. 1.86 లక్షల కోట్లు అనేది మాత్రమే సరైన సంఖ్య అని ఆ లెక్కను మోదీ సర్కార్ ఎక్కువ చేసి చెబుతోందని అన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలకు మించి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఉండదని అన్నారు. బ్యాంకులన్నీ ఆర్థిక ప్యాకేజీని అంచనా వేశాయని కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వాస్తవం కాదని అన్నారు. 
 
ఆర్థిక ఉద్దీపనకు ప్యాకేజీ ఏ మాత్రం పనికిరాదని... మోదీ దేశ జీడీపీలో 0.91 శాతం మాత్రమే ప్యాకేజీ కింద ప్రకటించారని చెప్పారు. మరి చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ప్రజల్లో కూడా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కేంద్రం ప్యాకేజీ వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంటే మరికొందరు ఆ ప్యాకేజీపై విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: