ప్రతిరోజూ చంద్రబాబు పేరుని వాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డినే. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తుంటారు. టీడీపీ నేతలు చేసే విమర్శలకు కౌంటర్ ఇస్తూనే బాబుకు పంచ్ ఇస్తుంటూ ఉంటారు. ఇక తాజాగా కూడా చంద్రబాబు సవాల్‌కు విజయసాయి అదిరిపోయే కౌంటర్ ఒకటి ఇచ్చారు.

 

ఈ సవాల్‌కు సంబంధించిన కౌంటర్ అమలైతే ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి వచ్చి చేరుతారు. అయితే అలా ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి వచ్చే సవాల్ ఏంటంటే? ఇటీవల విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు అనుమతులు ఇచ్చింది మీరంటే మీరని టీడీపీ-వైసీపీ నేతలు వాదించుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఈ సంస్థకు అనుమతులు వచ్చాయని వైసీపీ నేతలతో పాటు, సీఎం జగన్ కూడా చెబుతున్నారు.

 

కానీ తమ హయాంలో ఎల్జీ పాలిమర్స్‌కు ఒక్క ఎకరా కూడా కేటాయించలేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చాయని, వైఎస్సార్ హయాంలో పొల్యూషన్ పర్మిషన్ కూడా వచ్చిందని చంద్రబాబు, టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్టైరిన్ ఉత్పత్తి పెంపుకు అనుమతి వచ్చిందని, ఏయే ప్రభుత్వంలో ఏయే అనుమతులు వచ్చాయో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే చర్చకు రావాలని బాబు సవాల్ విసిరారు.

 

ఇక దీనికి విజయసాయి వెంటనే స్పందిస్తూ...చంద్రబాబు ఎల్జీ ప్లాంట్‌కు అనుమతులపై చర్చకు వస్తారా అని అడిగారు. ఇక మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?' అంటూ చంద్రబాబుకు విజయసాయి ఛాలెంజ్ విసిరారు. అయితే దమ్ముంటే చర్చకు రావాలన్న బాబు, విజయసాయి ఛాలెంజ్ స్వీకరిస్తే, ఇద్దరు నేతలు ఒకేవేదికపైకి వస్తారు. వారిద్దరు చర్చలో పాల్గొంటే ఇక అదొక అద్భుతమే. కానీ చంద్రబాబు ఎలాగో సవాల్ స్వీకరించరు కాబట్టి, ఇలాంటి చర్చలేమీ వర్కౌట్ కావు. 

మరింత సమాచారం తెలుసుకోండి: