ఈ కరోనా నాశనం అయిపోను, దీని మొలతాడు తెగిపోను అని నానాశాపనాలు పెడుతున్నారట కొందరు పెద్ద మనుషులు. నిజమే కదండీ. మనదేశం కాదు, మన రాష్ట్రం కాదు, మన రోగం కాదు.. ఎవడో తెచ్చిన కరోనా వల్ల పేదల బ్రతుకులు చితికి పోయాయి.. ఈ కరోనా వల్ల మరణించిన కుటుంబాలు అనాధలుగా మిగిలాయి.. మరెందరో వలకూలీల జీవితాలు అన్యాయంగా ప్రమాదాల బారిన పడి అనాధ శవాల్లా మారి పోయాయి.. ఇదొక నిశబ్ద యుద్దంగా సాగింది.. ఈ వైరస్ వల్ల కంటికి కనిపించని నష్టం కొన్ని సంవత్సరాల వరకు కోలుకోకుండా చేసింది.. ఒక రకంగా సాటి మనుషులను అనుమానించేలా మార్చింది.. ఇది ప్రళయం కానీ భయంకరమైన ప్రళయమే అని చెప్పక తప్పదు..

 

 

ఇకపోతే ఇప్పటికే కరోనా వల్ల లోకంలో మనుషులకు వచ్చిన కష్టాలు మామూలుగా లేవు.. బాలింత అని, చిన్న పిల్లలని, అనాధలని ఇలా ఎవరిని చూడటం లేదు.. ఎవరైనా బ్రతుకు దెరువు కోసం వెల్లిన వారు సొంత ఊరుకు వస్తే, ఆ ఊరి వారు నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు.. అందుకు నిదర్శనమే ఈ సంఘటన.. అదేమంటే.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం బొప్పరికుంట పంచాయతీ పరిధిలోని రాజులగూడకు చెందిన కుడిమెత జైతు, అనసూయ దంపతులు ఉపాధి నిమిత్తం కరీంనగర్‌ వెళ్లి అక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

 

 

ఈ నేపధ్యంలో అనసూయ కరీంనగర్‌లో ఈ నెల 14న బిడ్డకు జన్మనిచ్చింది. కాగా వారు ఈ నెల 15న సొంత గ్రామానికి చేరుకోగా.. స్థానికులు గ్రామంలోకి రానివ్వలేదు. ఎంత బ్రతిమిలాడుకున్న కనికరించలేదు.. ఇక చేసేది ఏం లేక అప్పటి నుంచి ఊరి పొలిమేరలో ఓ చెట్టు కింద గుడారం వేసుకుని ఉంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న హస్నాపూర్‌ వైద్యసిబ్బంది జాదవ్‌ అనిల్‌కుమార్‌, సుశీల, సంగీత బుధవారం అక్కడికి చేరుకుని బాలింతతో పాటు శిశువుకు వైద్యపరీక్షలు నిర్వహించి, ఎలాగోలా స్థానికులను ఒప్పించి, జైతు, అనసూయలకు క్వారంటైన్‌ ముద్ర వేసి.. ఆ బాలింత కుటుంబాన్ని రాజులగూడలోని వారి ఇంటికి తరలించారు...  

మరింత సమాచారం తెలుసుకోండి: