ప్రస్తుతం ప్రజలందరూ కరోనా వైరస్ భయం పట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ కు ఎలాంటి వాక్సిన్  కూడా అందుబాటులో లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అల  తెలంగాణ రాష్ట్రంలో కూడా రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుందన్న  విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు లాక్ డౌన్  సడలింపులు కు ముందు ఈ మహమ్మారి వైరస్ కేసులు భారీగా తగ్గిపోయాయి. ప్రతిరోజు కేవలం ఆరు, ఏడు కొత్త కేసులు మాత్రమే నమోదు అవుతూ వచ్చాయి . కాని ప్రస్తుతం ఏకంగా పదుల సంఖ్యలో ఈ కేసులు నమోదు అవుతుండడం మళ్లీ ఆందోళనకు గురి చేస్తోంది. 

 


 ఇక ఎంతో మంది ప్రజలు ఈ మహమ్మారి వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ఇతరులు చేసిన తప్పు కారణంగా మరొకరు కరోనా వైరస్ బారిన పడాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. రోజురోజుకీ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఈ వైరస్ లక్షణాలు కనిపించగానే ఎక్కువమంది డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇక్కడ ఒక మహిళ కరోనా  వైరస్ బారిన పడింది. తన భార్య కరోనా  వైరస్ బారిన పడడంతో భర్త తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.. ఇక ఎంతో మనస్తాపం చెంది ఎంత పని చేసాడో తెలిస్తే షాక్ అవుతారు. 

 


 భార్యకు కరోనా వైరస్ సోకింది అనే కారణంతో ఓ వ్యక్తి సమీపంలోని ఇతరుల వాహనాలను తగల పెట్టేసాడు. హైదరాబాద్లోని లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ లో ఓ మహిళకు కరోనా  వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి స్నేహితులతో సదరు మహిళ భర్త బాపు నగర్ లో మద్యం తాగాడు . అనంతరం తమ ఇంటి సమీపంలోని రెండు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో తగలపెట్టాడు. తనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: