ఒకవైపు దేశంలో కరోనా పాజిటివ్ సంఖ్య రోజురోజుకి చాపకింద నీరులా పెరిగిపోతూనే ఉంది. అయితే ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు దేశంలో తుఫాను వలన కొన్ని రాష్ట్రాల్లో వాతావరణం విలయతాండవం చేస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో అంఫాన్‌ తుఫాను ప్రభావంతో కలకత్తాలోని అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్ళింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కుండపోతగా వర్షం ఆ రాష్ట్రంలో కురుస్తుంది. కేవలం వర్షమే కాకుండా బలమైన ఈదురు గాలులతో విమానాశ్రయంలోని కొన్ని నిర్మాణాలు కూడా కూలిపోయాయి. విమానాశ్రయంలోని రన్వే, హాంగర్లు పూర్తిగా నీట మునిగాయి. 

 

 

IHG
దీనితో ఎయిర్ పోర్ట్ లోని అన్ని కార్యకలాపాలను నేడు ఉదయం 5 గంటలకు పూర్తిగా నిలిపివేశారు. దీనితో లాక్ డౌన్ దృష్ట్యా మార్చి 25 నుండి ప్రయాణీకుల విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఇందులో కేవలం కార్గో విమానాలకు మాత్రమే అక్కడ నడుపుతున్నారు. ఇకపోతే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అంఫాన్‌ తుఫాను తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది అని చెప్పవచ్చు.


ఇంతవరకు ఆ రాష్ట్రంలో 12 మంది మరణించారని అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తీవ్రమైన గాలులు బలమైన ఈదురు గాలులు వర్షం దృష్ట్యా రాష్ట్రంలో కొన్ని వేలాది గృహాలు నేలమట్టమయ్యాయి. అలాగే రాష్ట్రంలోని తీరం వెంబడి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏది ఏమైనా ఒక వైపు కరోనా పీడిస్తుంటే మరోవైపు వాతావరణం తన ప్రతాపాన్ని సృష్టిస్తోంది. అయితే తుఫాను నిన్న తీవ్రం దాటడంతో తుఫాను నుంచి బయటికి చేరుకునే పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: