దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. గత ఐదు రోజుల నుంచి ప్రతిరోజూ 5,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,10,000 దాటగా మృతుల సంఖ్య 3,400 దాటింది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 42,998 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వైరస్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలువురు నిపుణులు కరోనా వ్యాప్తి నివారణకు భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. పలు దేశాలు ఇప్పటికే తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని మార్గదర్శకాలు జారీ చేశాయి. 
 
నికోసియా యూనివర్శిటీ పరిశోధకులు కొన్ని రోజుల క్రితం ఆరు అడుగుల దూరంతో కరోనా సోకకుండా అడ్డుకోలేమని చెబుతున్నారు. బ్రిటన్ కు చెందిన నికోసియా విశ్వవిద్యాలయం భౌతిక దూరం గురించి అనేక పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించింది. కరోనా వ్యాధిగ్రస్తుడు దగ్గినా తుంపరలు గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో 18 అడుగుల దూరం వరకు ప్రయాణం చేస్తుందనే నిజాన్ని బయటపెట్టింది. 
 
ఆరు అడుగుల భౌతిక దూరం పాటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని నికోసియా యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వైరస్ తుంపరల ద్వారా 5 సెకన్లలోనే 18 అడుగుల వేగం ప్రయాణిస్తుందని... తక్కువ ఎత్తు ఉండే పెద్దలు, చిన్నారులకు ముప్పు ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. భౌతిక దూరం పాటించినా కరోనా భారీన పడే అవకాశం ఉందని యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో నిన్న 27 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1661కు చేరింది. ఆంధ్రప్రదేశ్ లో 45 కొత్త కేసులు నమోదు కాగా కేసుల సంఖ్య 2452కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: