చాలామంది ఎండ తగలకుండా ఇంట్లోనే ఉంటూ, ఏసి రూములో ఉంటూ జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే సూర్యరశ్మి పడకపోతే శరీరంలో ఎన్ని మార్పులు సంభవిస్తాయో వారికి తెలియదేమో. నిజానికి ఎండ ఆరోగ్యానికి చాలా అవసరం. కాకపోతే కాస్త ఎండ తగలగానే అయ్యో బాబు అంటూ భయపడి నీడలోకి వెళ్ళి పోతూ ఉంటారు. షూ సూర్యరశ్మి మన శరీరం మీద పడడంతో మనిషికి విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి నిజానికి మానవుని యొక్క కండరాలు బలంగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు విటమిన్-డి లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

IHG


అందుచేత రోజులో కొద్ది సమయం పాటు అయినా కాస్త ఎండకు ఉంటే మంచిది. ఇలా ఆలోచించకుండా చాలామంది వాటి కోసం మందులు వాడుతున్నారు. ఇలా పూర్తిగా ఎండ తగలకుండా ఉంటే గనక మానసికంగాను, ఒత్తిడి గాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారు ఎండలో కొద్ది సేపు కూర్చుంటే చాలా వరకు వాటి నుంచి విముక్తి పొందవచ్చును అని మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకవేళ నిద్ర లేమి లాంటి లక్షణాలు ఉన్నా దానికి విటమిన్-డి లోపం అని మనం గ్రహించవచ్చు. దీని కోసం కూడా మనం ఎండలో కొద్దిసేపు ఉండవలసి ఉంటుంది.

IHG

అయితే ఎండలో ఉండాలని ఏ సమయంలో పడితే ఆ సమయం లో నిలబడ కూడదు. ముఖ్యంగా మిట్టమధ్యాహ్నం లాంటి ఎండలో అసలు ఉండకూడదు. ఉదయం పూట ఉదయం 9 గంటల లోపు, సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయం మధ్యలో సూర్యరశ్మిలో నిలబడితే మన శరీరానికి కావాల్సిన విటమిన్ D ఉచితంగా లభిస్తుంది. ప్రస్తుతానికి ఉత్తర భారత దేశానికి చెందిన 60 శాతం పైగా మహిళల్లో విటమిన్-డి లోపం ఉందని కొన్ని సర్వే సూచనలు తెలియజేస్తున్నాయి. కాబట్టి రోజుకి ఒక 15 నిముషాలు అయిన ఎండలో ఉండడానికి ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: