రెస్లింగ్  అంటే ప్రస్తుతం ఇష్టపడని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక టీవీలో రెస్లింగ్ వస్తుందంటే టీవీ  కి అతుక్కుపొయి మరి  చూస్తూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరినీ రెస్లింగ్  ద్వారా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. డబ్ల్యూ డబ్ల్యూఈ  కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితమైంది కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు  అభిమానులు ఉన్నారు. అయితే డబ్ల్యూ డబ్ల్యూఈ  లో రెస్లర్స్  ఎంత ఫిట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

 


 డబ్ల్యూ డబ్ల్యూఈ  రెజ్లర్  బాడీ చూస్తుంటే ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఇది స్క్రిప్ట్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను మాత్రం అలరిస్తూనే ఉంది డబ్ల్యూ డబ్ల్యూఈ . ఇప్పటికీ ఎంతో మంది కొత్త రెజ్లర్లు  డబ్ల్యూ డబ్ల్యూఈ  కి వస్తూ ప్రేక్షకులకు  ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తూనే  ఉంటారు. అయితే ప్రేక్షకులకు ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచే డబ్ల్యూ డబ్ల్యూఈ  రెజ్లర్లకి ఎంత డిమాండ్ ఉంటుందో  ప్రత్యేకంగా చెప్పాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఇందులోని రెస్లర్ కి గుర్తింపు ఉంటుంది. 

 

 అయితే తాజాగా డబ్ల్యూ డబ్ల్యూఈ  లో విషాద ఘటన చోటుచేసుకుంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ లో స్టార్ రెగ్యులర్గా ఉన్నా షాట్ గ్యాస్ పార్డ్  ప్రమాదవశాత్తు మరణించాడు. తాజాగా కుమారుడితో కలిసి సరదాగా గడిపేందుకు కాలిఫోర్నియాలోని బీచ్ కి  ఈతకు వెళ్లిన షాడ్  అలల తాకిడికి తట్టుకోలేక సముద్రంలోకి కొట్టుకుపోయాడు. ఇక అక్కడే ఉన్న లైఫ్గార్డులు  దీనిని గమనించారు. వెంటనే  అప్రమత్తమై నీట  మునిగిపోతున్న కుమారుని కాపాడినప్పటికీ... తండ్రిని  మాత్రం కాపాడలేకపోయాడు. ఇక రెండు రోజుల తర్వాత అతని మృతదేహం లభ్యమైంది. స్టార్ రెజ్లర్  మృతిపై అటు ఎంతో మంది స్టార్ రెజ్లర్లు  సంతాపం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: