తెలంగాణలో రాజకీయాల్లో కానీ, ప్రజల్లో కానీ రేవంత్ రెడ్డి పేరు తెలియని వారు ఉండరు అంటే ఆశ్చర్యం ఉండదేమో. అంతగా ఆయన తెలంగాణ రాజకీయాల్లో పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీ గా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రేవంత్ రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించే వారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా రేవంత్ ముద్ర వేయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా, అధికార ప్రతినిధిగా అప్పట్లో ఆయన పార్టీలోనూ, ప్రజల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై పంచ్ డైలాగులు వేస్తూ, రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రసంగాలకు అందరూ ఫిదా అయ్యారు. ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి  కోల్పోయినా, రేవంత్ తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండిపోయారు. అయితే ఆయన ఆ తర్వాత చంద్రబాబు సూచనలతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. 

IHG

ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన అతికొద్ది రోజుల్లోనే హైకమాండ్ రేవంత్ ప్రతిభను  గుర్తింపు తెచ్చుకున్నారు. ఫలితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ పదవిని దక్కించుకోగలిగారు. కానీ తాను ఎప్పటి నుంచో కలలు కంటున్న పిసిసి అధ్యక్ష పదవిని మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఈ పదవిపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కన్నేశారు. అయితే వారంతా కలిసికట్టుగా రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కకుండా అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నారు. 

IHG


 రేవంత్ ఎప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని, రేవంత్ కు పిసిసి అధ్యక్ష పీఠం కట్టబెడితే తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని, అలాగే రేవంత్ పిసిసి అధ్యక్షుడు అయితే , పార్టీ అభివృద్ధి కంటే తన సొంత ఎదుగుదల కోసమే ఎక్కువగా కృషి చేస్తారని అధిష్టానం దగ్గర కాంగ్రెస్ సీనియర్లంతా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ కు సంబంధించిన ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. మొత్తంగా రేవంత్ కు చంద్రబాబు దగ్గర ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఆయన పీసీసీ ఆశలపై నీళ్లు జల్లేలా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: