ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకొని విల విలలాడుతుంది.  ప్రతిరోజూ కోరా కేసులు, మరణాల గురించి వింటుంటే వెన్నుల్లో వణుకు పుడుతంది.  కరోనా వల్ల ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మన దేశంలో కరోనా ధాటికి ఎక్కువ బలి అవుతున్నది మహారాష్ట్ర.  అత్యధిక కేసులు, మరణాలు ఇక్కడే సంబవించాయి.  ముఖ్యంగా కరోనా ఎక్కువగా ముంబాయిలో మరణాలు, కేసులు నమోదు అయ్యాయి.  కరోనా వైరస్‌ ధాటికి ముంబయి నగరం అతలాకుతలమైంది. దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటైన ముంబయిలో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. ఒక్క ముంబయిలోనే 24 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 840 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వందలాది మంది గర్భిణులు కూడా కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

 

ఇదే సమయంలో వందలాది మంది గర్భిణులు  కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వారిని కూడా ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందించారు. అలాంటి గర్భిణుల్లో చాలా మంది సుఖ ప్రసవం చేశారు. కొందరికి సీజేరియన్‌ కూడా జరిగింది. పుట్టబోయే పిల్లలకు కరోనా లేదని తేలడంతో వారి తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. కాగా,  ఇండియాలోని ముంబయిలో మాత్రం 100కు పైగా గర్భిణులకు కరోనా సోకింది. వీరంతా లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. కరోనా సోకిన గర్భిణులు.. గత నెల రోజుల నుంచి 115 మంది పిల్లలకు జన్మనిచ్చారు.

 

అయితే ఈ గర్బిణుల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినప్పటికీ.. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది.  కరోనా గర్భిణులకు పుట్టిన పిల్లల్లో 56 మంది మగ పిల్లలు, 59 మంది ఆడబిడ్డలు ఉన్నారు. కరోనా సోకిన ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. గర్భిణుల్లో అధిక మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినప్పటికీ వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు. కొందరూ జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: