తన రాజకీయ వారసుడు నారా లోకేష్ ను సమర్ధుడైన నాయకుడుగానే కాకుండా, తెలుగుదేశం పార్టీ రథసారథిగా ముందుండి నడిపించాలని, తాను రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చినా, లోకేష్ పార్టీలో ఎక్కడా అడ్డు లేకుండా, ఉండాలనే తాపత్రయంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అందుకే లోకేష్ పార్టీలో కీలక పదవిని అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు టిడిపి అధినేత గా లోకేష్ పేరు ప్రస్తావించినా, సొంత పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో కొత్త పోస్టు సృష్టించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు త్వరలో నిర్వహించబోయే మహానాడులో ఈ ప్రతిపాదనను చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. గతేడాది మహానాడు జరగాల్సి ఉన్నా, ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ ఏడాదైనా మహానాడు ఘనంగా నిర్వహిద్దామని చూసినా, కరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాది మహానాడు జరిగే అవకాశం కనిపించడం లేదు.

 


 అయితే ఎట్టి పరిస్థితుల్లో అయినా, మహానాడు నిర్వహించాలని చూస్తున్న చంద్రబాబు దీనిని నిర్వహించాలని, అలా కాని పక్షంలో మహానాడు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదే సమావేశంలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ పేరు ప్రస్తావించాలని చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే మే నెల ఆఖరిలోపు మహానాడు నిర్వహించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అలా కానీ పక్షంలో అందుబాటులో ఉన్న కొంతమంది నాయకులు, లేకపోతే జూమ్ యాప్ ద్వారా అయినా మహానాడు నిర్వహించి తన మనసులో మాటను పార్టీ నాయకుల ముందు బయట పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.


 లోకేష్ కు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే పార్టీలో ఆయన ఇమేజ్ పెరుగుతుందని, ఆ తర్వాత ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినా పార్టీపై పట్టు అలాగే ఉంటుందని, చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీపై పట్టు సాదించినట్టుగా నమ్మకం కుదిరిన తరువాత తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతలు ఆయనకు అప్పగించి తాను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుని, తెర వెనుక లోకేష్ కు మద్దతుగా నిలబడాలని చూస్తున్నట్టు సమాచారం. దానికి అనుగుణంగానే చంద్రబాబు లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించాలని చూస్తున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: