ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ఈ దెబ్బతో నాలుగోసారి దేశంలో లాక్ డౌన్ పొడిగించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి కొన్ని సడలింపు లతో లాక్ డౌన్ కొనసాగుతుంది. కేవలం కంటోన్మెంట్, రెడ్ జోన్లలో మాత్రమే కాస్త తీవ్రమైన చర్యలు చేపడుతున్నారు. ఇక ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో చాలా వాటికి కార్యకలాపాలు జరగడానికి అనుమతి ఇచ్చింది. దీనితో దేశంలో అనేక చోట్ల వ్యాపార లావాదేవీలు కొనసాగుతూనే ఉన్నాయి.


అయితే ఇక అసలు విషయానికి వస్తే..  గుజరాత్ రాష్ట్రంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. గిర్ సోమనాథ్ జిల్లాలో ఒక నిండు గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతున్న సమయంలో ఆ మహిళను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో ఒక నాలుగు సింహాలు అంబులెన్స్ కు అడ్డుగా నిలబడ్డాయి. ఇకపోతే ఆ సింహాలు ఎంతసేపటికి కదలక పోవడంతో నిండు గర్భిణీ నరకయాతన అనుభవించింది. అది కూడా రాత్రివేళ కావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 


నిజానికి ఆ సింహాలు చాలాసేపటికి ఉన్నచోట నుంచి కదలకుండా అలాగే ఉన్నాయి. అంతే కాకుండా ఇంకో వైపు వెళ్లడానికి వేరే మార్గం లేకపోవడంతో మరేమి చేయలేక అంబులెన్స్ డ్రైవర్ ఆ వాహనాన్ని అక్కడే నిలిపివేశాడు. ఇకపోతే గర్భిణీ నొప్పులు ఎక్కువ కావడంతో ఆంబులెన్స్ లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దాదాపు 20 నిమిషాల పాటు అంబులెన్స్ ను ఆ నాలుగు సింహాలు పక్కకు కదలకుండా ఉండడంతో అక్కడే నిలిపి వేయాలిసి వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ నాలుగు సింహాలు ఎట్టకేలకు పక్కనున్న అడవిలోకి వెళ్లిపోయాయి. ఇక దాంతో ఆ తర్వాత అంబులెన్సు డ్రైవర్ అంబులెన్స్ ను, అందులోని తల్లి బిడ్డను ఆస్పత్రికి తరలించారు. అన్ని వైద్య పరీక్షల తర్వాత తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: