రామాయణం వింటే రాముడి గొప్పతనం ఎంటో తెలుస్తుంది.. నిజాయితీ, మంచితనం, తండ్రి కి ఇచ్చిన మాట కోసం పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసిన మహానుభావుడు. ఇక శ్రీ రాముడు పేరు చెబితేనే ప్రతి భారతీయుడు పులకించిపోతాడు. అయోద్య ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్యపట్టణం. అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆ విస్కరణకు మూలం.  మొన్నటి వరకు రామ మందిరం గురించి ఎన్నో గొడవలు జరిగిన విషయం తెలిసిందే.  అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఈ రోజు స్థలాన్ని చదును చేస్తుంగా పెద్దసంఖ్యలో ఆలయ ఆనవాళ్లు బయటపడ్డాయి. 

 

నల్లరాతి, ఎర్రరాతి స్తంభాలు, పుష్పకలశం, శిథిలమైన దేవతా విగ్రహాలు వెలుగు చూశాయి. దీంతో అక్కడ ఇది వరకు ఆలయం ఉన్నట్లు రూఢి అవుతోంది. తవ్వకాల్లో 5 అడుగుల శివలింగం, 7 నల్లరాతి స్థంభాలు, 6 ఎర్రరాతి స్థంభాలు, విరిగిపోయి దేవతల విగ్రహాలు లభించాయని అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆలయం నిర్మాణానికి వచ్చే ఏడాది జనవరిలో భూమిపూజ నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రసుతం కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్ విధించారు.  

 

కాగా, ఈ నెల 11 నుంచి పనులు మొదలు పెట్టామని, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. కాగా గతంలోనూ జరిపిన తవ్వకాల్లో ఇలాంటి బయపడ్డాయని బీజేపీ నేత రాంమాధవ్ చెప్పారు. వివాదాస్పద స్థలాన్ని సుప్రీం కోర్టు హిందువులకు కేటాయించడంతో అక్కడ గుడి పనులు సాగుతున్నాయి. మసీదు కోసం అయోధ్య సమీపంలో 5 ఎకరాల భూమిని కేటాయించడం తెలిసిందే. సాధారణంగా ఇలాంటి తవ్వకాల్లో ఎన్నో అమూల్యమైన వస్తువులు లభించడం సర్వసాధారం.. తాజాగా విగ్రహాలు, శివలింగం, స్థంబాలు అద్భు కళారూపాలు బయట పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: