ఈ హెడ్డింగ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ జీవితానికే కాదు ఆయ‌న వ్య‌క్తి గ‌త జీవితానికి.. సినిమా జీవితానికి కూడా చాలా వ‌ర‌కు వ‌ర్తిస్తుంది.. ఇక వ్య‌క్తిగ‌త జీవితం అనేది మ‌న‌కు అన‌వ‌స‌రం అనుకుని కాసేపు ప‌క్క‌న పెట్టేస్తే ఆయ‌న సినిమాల్లో గ‌త ఏడెనిమిదేళ్ల‌లో లాభాలు తెచ్చిన సినిమా లేదు. అప్పుడెప్పుడో వ‌చ్చిన అత్తారింటికి దారేది త‌ర్వాత ప‌వ‌న్ చేసిన సినిమాలు అన్నీ డిజాస్ట‌ర్ లే. ఇక ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వెళ్లి ప్లాప్ వేసి మ‌ళ్లీ ఇప్పుడు తిరిగి ముఖానికి రంగేసుకుంటున్నాడు. ప‌వ‌న్ న‌టిస్తోన్న తాజా సినిమా వ‌కీల్ సాబ్ అన్ని స‌వ్యంగా ఉండి.. క‌రోనా లేక‌పోతే ఈ మేలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేదే.

 

ఇదిలా ఉంటే ప‌వ‌న్ తాజాగా గ్యాస్ ప్ర‌మాదంపై తీరిగ్గా స్పందించ‌డంతో పాటు వారికి న్యాయం జ‌ర‌గ‌కుండా ఉద్య‌మాలు చేస్తాన‌ని చెప్ప‌డం చాలా కామెడీగా ఉంద‌నే చెప్పాలి. అక్క‌డ 12 మంది చ‌నిపోతే ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు కావ‌చ్చు.... వారికి ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఇచ్చిన రు. కోటి ప‌రిహారం కావ‌చ్చు.. వాటిని చూసి దేశం అంతా ముక్కు మీద వేలేసుకుంది. ఇక చీటికి మాటికి జ‌గ‌న్‌ను తిట్టే చంద్ర‌బాబు సైతం నోరు పెగ‌ల్చ‌లేక‌పోయారు. పార్టీ నేత‌ల‌తో ప‌వ‌న్ మాట్లాడుతూ  .. అది కూడా ప‌ది రోజులు అయిపోయాక ప్ర‌భుత్వం బాధితుల‌కు న్యాయం చేయ‌క‌పోతే ఉద్య‌మిస్తాన‌ని చెప్ప‌డంతో జ‌న‌సేన వాళ్లే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

 

చివ‌ర‌కు రెండు రోజుల్లో ఈ ఇష్యూను జ‌గ‌న్ ప్ర‌భుత్వం క్లోజ్ చేసేసింది. అటు విశాఖ‌లోనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు లాంటి వాళ్లు సైతం జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని తెగ మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు మ‌నోడికి తీరిగ్గా టైం దొరికిందో ఏమో గాని.. ప్ర‌భుత్వం బాధితుల‌కు న్యాయం చేయ‌క‌పోతే పోరాటం చేస్తాడ‌ట‌. మ‌రి ఇంత‌క‌న్నా ఏం వెట‌కారం ఉంటుంది చెప్పండి ? అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన కామెడీ సేన అయిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. ప‌ది రోజుల క్రితం జ‌రిగిన ప్ర‌మాదంపై ఎప్పుడో గుర్తొచ్చిన‌ప్పుడు స్పందిస్తూ ప‌వ‌న్ ఇలా మాట్లాడ‌డంతో సొంత పార్టీ నేత‌లే విస్తుపోతున్నారు. ఇలాంటి రాజ‌కీయాన్ని.. రాజ‌కీయ నేత‌ను మ‌నం న‌మ్ముకుంటే మ‌నం రాజ‌కీయం ఏ తీరానికి ఎప్ప‌ట‌కి చేరుతుందో ? అని నిట్టూర్పులు విడుస్తున్నారు.  మొత్తానికి ప‌వ‌న్ ఏదేదో చేయ‌బోయి దానికి ముందే అట్ట‌ర్ ప్లాప్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: