ప్రస్తుతం యువత లో వినపడుతున్న ఒక మాట పబ్ జి .. ఆ గేమ్ ను యువత ఆలోచనలను సందించే విధంగా ఆసక్తిగా డిజైన్ చేసిన మైండ్ గేమ్..అందుకే ఈ గేమ్ ను ఆడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.. అందులో లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయిన యువత ఎక్కువగా పబ్ జి ఆడుతున్నారు..ఆ గేమ్ కు అలా అలవాటు పడ్డారు . రాత్రింబవళ్ళు ఆడుతున్నరటంటే అంతగా దానికోసం అలవాటు ప డ్డారాన్నమట.. 

 

 

 

అయితే పబ్ జి ఆడుతూ ఓ యువకుడు ప్రాణాలను విడిచాడట.. వివరాల్లోకి వెళితే..అంతలా యువతపై ప్రభావం చూపుతున్న పబ్జి ప్రాణాలు తీసేంత ఒత్తిడిని కూడా కలిగిస్తోందా? ఈ ఆటంటే పడి చచ్చిపోయే కుర్రకారు నిజంగానే ప్రాణాల మీదకు తెచ్చుకుంటోందా? తమిళనాడులో తాజాగా వెలుగుచూసిన ఘటన చూస్తే నిజమేనని ఒప్పుకోక తప్పేలా లేదు.ఈరోడ్ జిల్లా కరుంగలపాళయం ఏరియా కమలా నగర్‌కి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి సతీష్ కుమార్‌(16)కి పబ్‌జీ అంటే పిచ్చి. ఎప్పుడు ఖాళీ దొరికినా పబ్జి ఆడుతూ ఉండేవాడు. సాయంత్రం వేళ ఇంట్లో కూర్చుని పబ్జి ఆడుతున్న సతీష్ ఒక్కసారిగా కొందపడిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయిన సతీష్‌ని చూసిన తల్లిదండ్రులు కంగారుపడ్డారు.

 

 

 

 

వెంటనే సతీష్‌ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే సతీష్ చనిపోయినట్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండెబద్దలైంది. చేతికందొస్తున్న కొడుకు హఠాన్మరణం కుంగదీసింది. ఆడుకుంటూ కిందపడి చనిపోవడమేంటో అర్థంకాక కన్నీరుమున్నీరుగా విలపించారు. సతీష్ మరణానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.అయితే పాల్తెక్నిక్ చదువుతున్న అతను లాక్ డౌన్ కారణంగా కాలేజీలు లేకపోవడంతో అతను అలా రోజంతా పబ్ జి ఆడుతుందేవాడని పేరెంట్స్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విధంగా అతడు ఒత్తిడికి లోను కావడంతో ఇలా హఠాన్మరమతో చనిపోయారని వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: