జేసీ దివాకర్ రెడ్డి.. ఏ పార్టీలో ఉన్నాసరే కుండబద్దలు కొట్టేలా మాట్లాడతారన్న విషయం తెలిసిందే. ఇక టైమ్ బట్టి సొంత పార్టీని తిట్టగలరు...ప్రత్యర్ధి పార్టీని పొగడగలరు. అయితే ప్రస్తుతం టీడీపీలో కీలక నాయకుడుగా ఉన్న జేసీ...సొంత పార్టీకే సందర్భాన్ని బట్టి చాలాసార్లు చురకలు అంటించారు. 2014లో అధికారంలో ఉన్నా, 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయినా సరే జేసీ, చంద్రబాబుకు పలు విషయాల్లో సలహాలు కూడా ఇచ్చారు.

 

కానీ బాబు ఎప్పుడు జేసీ మాట వినలేదు. ఇక తాజాగా విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని చెప్పి చంద్రబాబు, టీడీపీ శ్రేణులకు ఒక్కరోజు నిరసన దీక్ష చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాబు పిలుపుతో నేతలు తమ తమ నియోజకవర్గాల్లో దీక్షలు చేశారు. ఇదే దీక్షలపై జేసీ హాట్ కామెంట్స్ చేశారు. ఇంట్లో ఉండి దీక్ష చేస్తే జగన్ స్పందిస్తారా? టీడీపీ నేతలు దీక్ష ఎందుకు చేస్తున్నారో అర్దం కావడం లేదని.. ఇంట్లో ఉండి దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారు అంటూ మాట్లాడారు.

 

వాస్తవానికి జేసీ చెప్పింది కరెక్ట్. అసలు ఇంతవరకు టీడీపీ చేసిన ఏ దీక్షని పట్టించుకోలేదు. ఇప్పుడు చేసిన అదే పరిస్తితి. అలాగే ప్రజలు కూడా టీడీపీ దీక్షల పట్ల పెద్ద ఆసక్తి చూపడం లేదు. కాబట్టి దీక్షలు ఎక్కడికక్కడే ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా అదే అయింది. అయితే జీసీ సొంత పార్టీని విమర్శించడంతో పాటు, జగన్‌ని పొగడారు.

 

పోతిరెడ్డిపాడు విషయంలో జగన్ అనుకున్నది చేస్తారని,  దాని ఎత్తును పెంచి, సముద్రంలో వృధాగా కలిసే నీటిని రాయలసీమ అవసరాల కోసం మళ్లించాలని అనుకోవడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. అంటే జగన్ బాగా మొండివాడని, అనుకుంటే ఏదైనా చేస్తారని జేసీకు ముందు నుంచి తెలుసు. ఆయన కూడా ఎప్పుడు అదే చెబుతా ఉంటారు. పైగా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి జగన్‌పై జేసీకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. అటు జేసీ సలహాలని బాబు పాటిస్తే కాస్త బాగుపడే అవకాశాలున్నాయి. లేదంటే అదే మూస రాజకీయం చేస్తే ప్రజలు అసలు పట్టించుకోరు.

మరింత సమాచారం తెలుసుకోండి: