చైనా అంటే పీకల్లోతు కోపం అన్ని దేశాలకు ఉంది.కారణం అందరికీ తెలిసిందే. మనిషి అన్న ప్రతీవాడు ఈ భూమ్మీద చైనాను తప్పకుండా ఇపుడు  తలచుకుంటున్నాడు, తిట్టిపోస్తున్నాడు. చైనా కాస్తా  జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే కరోనా వైరస్ మహమ్మారి దేశాలు దాటి వచ్చేది కాదు కదా అన్నది అందరి బాధా, ఆగ్రహం కూడా.

 

అయితే చైనాను బోనులో పెట్టడానికి  ఏ విధమైనా ఆధారాలు లేవు. ఒకవేళ  ఉన్నా చైనా వాటిని ఎపుడో దాచేసి పాతరేసి ఉంటుంది. అందువల్ల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్  మాదిరిగా హూంకరింపులు చేయడం తప్ప లాభం లేకపోతోంది. ఇక అమెరికాకు అయితే చైనా మీదకు  దండెత్తి యుధ్ధం చేయాలని కూడా ఉంది. కానీ దానికి కూడా ఒక కారణం ఉండాలిగా.

 

అందుకే ఎక్కడలేని ప్రేమనూ భారత్ మీద ఇపుడు ట్రంప్ ఒలకబోతున్నాడు, చైనా దాదాపుగా అరవైయ్యేళ్ళ పాటు ఇండియాను ముప్పతిప్పలు పెడుతోంది. 1962 లో డైరెక్ట్ గా ఒకసారి యుధ్ధం చేసిన చైనా ఆ తరువాత నుంచి ఇండైరెక్ట్ గా యుధ్ధం చేస్తోంది. పాకిస్థాన్ని రెచ్చగొట్టి భారత్ మీదకు ఉసిగొలుపుతోంది. అదే సమయంలో ఆయుధాలు కూడా సమకూర్చుతోందని అంటారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే సరిహద్దుల్లో భారత్ తో ఘర్షణలు పడడం కూడా చైనాకు దశాబ్దాలుగా అలవాటు అయిన విషయమే. అదే సమయంలో భారత్ కి ఇప్పటిదాకా అమెరికా సహా ఏ దేశం కూడా మద్దతుగా నోరు విప్పిన ఘటనలూ లేవు. పాకిస్థాన్ పాపాలను ఎన్నో సార్లు బయటపెట్టినా మాట్లాడని దేశాలు చైనా వంటి పెద్ద దేశం విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటాయి. అందువల్ల భారత్ చైనాతో బాధలను ఇప్పటిదాకా  అన్యాయంగా భరిస్తూ వస్తోంది.

 

ఇపుడు మరో గొంతు మద్దతుగా భారత్ కి మాట్లాడుతోంది. ఆ గొంతు ఎవరో కాదు, అమెరికా. భారత్ సరిహద్దుల్లో చైనా ఆధిపత్యం చేస్తోందని అమెరికా తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాదు, దక్షిణ చైనా సముద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కూడా అంటోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖకు చెందిన సీనియర్ అధికార్ ఆలీస్ వెల్స్ చేసినా హాట్ కామెంట్స్ చైనాకు ఘాటుగానే తగులుతున్నాయి.

 

భారత్ ని ఒంటరిని చేసి దశాబ్దాలుగా చెడుగుడు ఆడుతున్న డ్రాగాన్ కి ఇది ఓ విధంగా హెచ్చరికగా భావించాలి. అయితే అమెరికాకు  చైనా మీద కోపం ఉంది. అందువల్లనే భారత్ కి మద్దతుగా మాట్లాడుతోంది, పైగా భారత్ భుజాన తుపాకీ పెట్టి చైనాను కాల్చాలనుకుంటోంది. మరి ఈ విషయంలో అమెరికా చివరిదాకా నిలబడుతుందా అంటే చెప్పలేం.  ట్రంప్ మళ్ళీ అమెరికా ప్రెసిడెంట్ అయితే మాత్రం చైనాకు గట్టి బుద్ధి  చెప్పడం ఖాయం. అదే సమయంలో ఆయన ఓడి వేరొకరు అక్కడ అధికారంలోకి వస్తే చైనాకు బేఫికర్ గా ఉంటుంది.

 

ఏది ఏమైన చైనాకు బుధ్ధి చెప్పాలని భావిస్తున్న ట్రంప్ మళ్ళీ నెగ్గితే మాత్రం దక్షిణాసియాలో చైనా పెత్తనానికి గట్టి బ్రేకులేస్తాడు. ఈ అవకాశాన్ని భారత్ కూడా ఉపయోగించుకుని డ్రాగాన్ కి తన చోటు ఏంటో చూపిస్తే బెటర్ అన్న విశ్లేషణలూ ఉన్నాయి. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: