ప్రస్తుత రోజుల్లో నిజాయితీ ఎక్కడా కనబడటం లేదు. సొంత ఇంటిలో గాని స్నేహితుల మధ్య గాని ఆఖరికి భార్యభర్తల మధ్య కూడా నిజాయితీ లేకుండా పోయింది. ఏదో ఒక ఉద్దేశంతో లేనిపోని కబుర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ అవసరాలు తీర్చుకుంటున్నా రోజులివి. ముఖ్యంగా డబ్బు కోసం సొంత రక్త సంబంధాలను కూడా చాలా దారుణంగా చంపుకుంటూ ఉన్న రోజుల్లో మరియు సమాజంలో బ్రతుకుతున్నాం. రోడ్డు మీద రూపాయి కనబడిన కామ్ గా ఎవరు చూడకుండా జోబులో వేసుకుంటున్న సమాజంలో ఒక వ్యక్తి మిలియన్ డాలర్లు ఉన్న బ్యాగ్స్ రోడ్డుమీద కనిపించడంతో వాటిని పోలీసులకు అప్పగించాడు. ఆ బ్యాగ్ లో ఒకటి కాదు రెండు కాదు భారతీయ కరెన్సీలో దాదాపు 75 లక్షల రూపాయలు ఉన్నాయి.

 

అయినా కానీ అన్ని లక్షల డబ్బులు పై మోజు పడకుండా, ఆశ పడకుండా నిస్వార్ధంగా పోలీసులకు అప్పగించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల వర్జీనియాకు చెందిన డేవిడ్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జాలీ ఒక హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నాడు. ఆ క్రమంలో కొంత దూరం వెళ్లిన తర్వాత అతడికి రోడ్డు మద్యలో ఒక బ్యాగ్‌ కనిపించింది. దానికి పక్కకు తొలగి వెళ్లకుండా చెత్త అయ్యి ఉంటుంది డస్ట్‌ బిన్‌లో పడేద్దామని భావించాడు. ఇదే సమయంలో మరొక బ్యాగ్ కనిపించింది దాన్ని తీసుకుని రెండు బ్యాగులను తెరచి చూడగా కొన్ని లక్షల డబ్బులు అందులో ఉన్నాయి.

 

వెంటనే ఏ మాత్రం ఆశ పడకుండా నేరుగా పోలీసులకు డేవిడ్ అనే ఆ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అయితే డేవిడ్ నిజాయితీకి మెచ్చిన పోలీసులు అతడికి కొంత నగదు బహుమానం ఇవ్వడం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు అతని నిజాయితీని మెచ్చుకుంటున్నారు. మీలాంటివారు ఉండబట్టే కరోనా వైరస్ వచ్చిన గాని ప్రపంచం ఇంకా నాశనం అవ్వకుండా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: