లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇన్నాళ్లు రైల్వే సేవ‌లు నిలిచిపోగా దేశ‌వ్యాప్తంగా జూన్ ఒక‌ట‌వ తేదీ నుంచి కొన్ని రైళ్ల‌ను పున‌రుద్ద‌రిస్తున్నారు. జూన్ 1 నుంచి 200 రైళ్లు నడపాలని నిర్ణయించి, గతంలోని రైళ్ల షెడ్యూల్ టైం టేబుల్ ప్రకారంగా రైళ్లు నడపనున్నట్లు తెలిపిందది. రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఇస్తున్నామని, కౌంటర్ల ద్వారా బుకింగ్ అవకాశం లేదని, ప్రస్తుతానికి నాన్ ఏసీ రైళ్లు మాత్రమే ఉంటాయని అధికారులు మొద‌ట్లో స్పష్టం చేశారు. అయితే, దీనికి కొన‌సాగింపుగా కౌంట‌ర్ల‌లోనూ టికెట్లు కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పించారు.

 

రైల్వే సేవ‌లు అందుబాటులోకి వ‌స్తున్న‌ నేప‌థ్యంలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా సుమారు 200 రైళ్ల‌కు ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించారు. జూన్ ఒక‌టి నుంచి న‌డిచే సుమారు 73 రైళ్లకు సంబంధించి ల‌క్షా 49 వేల టికెట్లు బుక్ అయిన‌ట్లు ఇవాళ రైల్వేశాఖ వెల్ల‌డించింది. రాబోయే రెండుమూడు రోజుల్లో.. రైల్వే స్టేష‌న్ల‌లో ఉన్న కౌంట‌ర్ల వ‌ద్ద బుకింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న 1.7 కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల వ‌ద్ద రేప‌టి నుంచి బుకింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. స్టేష‌న్ల వ‌ద్ద నిర్వ‌హించే బుకింగ్ కోసం ప్రోటోకాల్‌ను త‌యారు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. రానున్న కొన్ని రోజుల్లో మ‌రిన్ని రైళ్ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. రైల్వే స్టేష‌న్లలో ఉన్న షాపుల‌ను ఓపెన్ చేసేందుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు తెలిపారు. కానీ టేక‌వేలు మాత్రమే అందుబాటులో ఉంటాయ‌న్నారు.

 

ఇదిలాఉండ‌గా, సికింద్రాబాద్‌, నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ల నుంచి కొన్ని రైళ్లు క‌ద‌ల‌నున్నాయి.  వాటి జాబితా ఇలా ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వ‌చ్చే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ముంబై నుంచి హైదరాబాద్ మ‌ధ్య న‌డిచే హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మ‌ధ్య న‌డిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌, హౌరా నుంచి సికింద్రాబాద్ మ‌ధ్య న‌డిచే ఫలక్‌ను మా ఎక్స్‌ప్రెస్‌,  సికింద్రాబాద్ నుంచి డనపూర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్‌, గుంటూరు నుంచి సికిం ద్రాబాద్ మ‌ధ్య న‌డిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి నుంచి నిజామా బాద్ మ‌ధ్య న‌డిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు ఇవాళ ఉద‌యం నుంచి రిజ‌ర్వేష‌న్ టికెట్ సౌక‌ర్యం క‌ల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: