ప్రస్తుత సమాజం చాలా క్రూరంగా మారిపోయింది. విలువైన సంబంధాలు, బాంధవ్యాలు, బంధాలు అన్ని కనుమరుగవుతున్నాయి. ఎవరికి వారు స్వార్థంగా ఆలోచించుకుంటూ తమ కోరికలను నెరవేర్చుకోవడానికి కోసం ఎదుట మనుషులను మోసం చేస్తున్న రోజుల్లో మరియు సమాజంలో బతుకుతున్నాం. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో స్నేహానికే సిగ్గుచేటు తెచ్చిన ఒక దుర్మార్గుడు నీచుడు గురించి తెలుసుకుందాం. ఎవరికైనా మంచి చేయాలని ముందడుగు వేస్తే అదే మనకు చెడుగా మారుతుందని పూర్వం మన పెద్దలు అంటూ ఉండేవారు. సరిగ్గా ఈ విధంగానే కేరళ రాష్ట్రంలో ఒక సంఘటన చోటు చేసుకుంది.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నాడు. కేరళ రాష్ట్రంలో ఎర్నాకులంలో కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతున్న వ్యక్తికి చిన్ననాటి స్నేహితుడు  లోథారియో ఫోన్‌ చేశాడు. లాక్‌ డౌన్‌ వల్ల నేను చిక్కుకు పోయాను. ఎర్నాకులంలో ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వగలవా అంటూ అడిగాడు. దీంతో చిన్ననాటి స్నేహితుడు కావడంతో అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లో ఉండటంతో క్షణం ఆలోచించకుండా వెంటనే తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడు. ఇంటికి వచ్చి స్నేహితుడు దాదాపు నెలన్నర రోజులు లోథారియో స్నేహితుడి భార్యతో క్లోజ్‌ అయ్యాడు. స్నేహతుడు బయటకు వెళ్లిన సమయంలో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అదును చూసి లోథారియో స్నేహితుడు మోసం చేసి పిల్లలను సైతం ఆలోచించకుండా ఆమెను తనతోపాటు వచ్చేయాలని అనేకసార్లు ఒత్తిడి తెచ్చాడు.

 

ఇలా జరుగుతున్న సమయంలో ఒకరోజు స్నేహితుడి ఇంట్లో లేని సమయంలో లోథారియో ఆమెతో కలిసి కారులో పారిపోయాడు. దీంతో ఇంటికి వచ్చిన స్నేహితుడు విషయం తెలుసుకుని బోరున విలపించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేయటం అదేవిధంగా స్నేహం పేరుతో సదరు వ్యక్తి మోసం చేయడంతో పిల్లలను పట్టుకొని గట్టి గట్టిగా ఏడ్చాడు. దీంతో చుట్టుపక్కల వున్న ప్రజలు ఈ విషయం గ్రహించి మొత్తం పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ గాలింపు చర్యలు చేపట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: