కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌ అన్ని రంగాలపై పడింది. క్రీడారంగంపై దీని ప్రభావం భారీగా పడింది. గత రెండు నెలలకు పైగా క్రీడాలోకం స్తంభించిపోయింది. వైరస్‌ దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా టోర్నమెంట్‌లు వాయిదా పడ్డాయ్‌. ఇప్పటికే ఐపీఎల్‌ తాత్కాలికంగా రద్దవ్వగా.. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ-20 మెగాటోర్నిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

 

కరోనా ఈ పేరు వింటనే ప్రపంచదేశాలన్నీ హడలిపోతున్నాయ్‌. ఈ మహమ్మారి 213 దేశాలను చుట్టేసింది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. పర్యాటకం, ఆర్థిక రంగాలు కోలుకులేని దెబ్బతిన్నాయ్‌. క్రీడా రంగం అయితే రెండు నెలలుగా స్తంభించిపోయింది. మెగాటోర్నిలన్నీ రద్దయ్యాయ్‌. కరోనా ఎఫెక్ట్‌ క్రికెట్‌పై భారీగానే పడింది.

 

ఇప్పుడు ఈ మహమ్మారి కన్ను ప్రతిష్టాత్మక టీ-20 ప్రపంచకప్‌పై పడింది.  కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన మెగాటోర్నిని 2022కి మార్చే ఆలోచనలో ఐసీసీ ఉందని తెలుస్తోంది. టీ-20 ప్రపంచకప్‌ కోసం  16 జట్లు ఆస్టేలియాకు రావాలి.  ప్ర‌యాణం, స్టేయింగ్‌ విషయాల్లో చాలా రిస్క్ ఉంది. దీంతో ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్‌పై నీలినీడలు కమ్ముకున్నట్టేనని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.

 

ఈ నెల 28న ఐసీసీ బోర్డు మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్‌లో టీ-20 ప్రపంచకప్‌ నిర్వహణపై ఫైనల్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టోర్నీ వాయిదాపైనే ప్ర‌ధాన చ‌ర్చ జ‌రుగనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ప్రయాణ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయ్‌. ఈ సమయంలో టోర్నిని వాయిదా వేయడంపైనే ఐసీసీ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ టైంలో ఐపీఎల్‌ జరిగే అవకాశం ఉంది. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళిక రచిస్తోంది. ఈ ప్లాన్‌పై కేంద్రం అనుమతిస్తే ఐపీఎల్‌ కచ్చితంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ మధ్య కాలంలో జరిగే ఛాన్స్‌ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: