జగన్ గురించి రాష్ట్ర ప్రజలకు పదేళ్లుగా తెలుసు. రాజకీయ నాయకులకు కూడా అపుడే తెలుసు. కానీ జగన్ని చిన్నతనం నుంచి తెలిసిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో రాజకీయాల్లో పండిపోయిన వారు కూడా ఉన్నారు. ఎవరు జగన్ గురించి చెప్పినా విలువ తక్కువ, కానీ జగన్ని చిన్నప్పటి నుంచి చూసిన వారు ఆయన గురించి చెబితే వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. కొంత నమ్మబుద్ధ్హి కూడా వేస్తుంది.

 

ఇంతకీ జగన్ గురించి అంతాలా తెలిసిన వారు ఎవరు ఉన్నారు అంటే. అనంతపురం జిల్లాకు చెందిన పెద్దాయన జేసీ దివాకర్ రెడ్డి పేరు చెప్పాలి. మా వాడు జగన్ అంటూ చనువుగా ఏపీలో మాట్లాడేది జేసీనే. అదే విధంగా జగన్ని నానా మాటలు అన్నాకూడా ఆది  జేసీకే చెల్లు. అటువంటి జేసీ తాజాగా కొన్ని కామెంట్స్ చేస్తూ తెలుగుదేశం పార్టీనే ఇరుకునపడేశారు.

 

జగన్ ముందు కుప్పిగెంతులు వద్దు అంటున్నారు. ఎవరి ఇంట్లో వారు కూర్చుని టీడీపీ తమ్ముళ్ళు  నిరాహార దీక్షలు చేస్తే జగన్ వింటాడా. మారతాడా అంటూ ఎకసెక్కమాడారు. జనంలో ఉన్న పరువు పోగొట్టుకోవద్దు అని టీడీపీ పెద్దలకే అంటే చంద్రబాబుకే ఆయన  నేరుగా సూచిస్తున్నారు. జగన్ ముందు తట్టుకోవడం కష్టమని కూడా చెప్పేస్తున్నారు.

 

జగన్ని ఎదిరించి నిలబడడం ఇప్పట్లో కష్టమేనని కూడా తేల్చేశారు. ఇక జగన్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో సిన్సియర్ గా చేస్తున్నాడని కూడా జేసీ మెచ్చుకుంటున్నారు. మా పార్టీ వారికి కోపం వచ్చినా కూడా జగన్ ఈ విషయంలో చేస్తున్నది కరెక్ట్. ఆయనకు పట్టుదల ఉంది. సాధించగలడో లేడో తెలియదు కానీ జగన్ సీమకు మంచి పనే చేస్తున్నాడు అని జేసీ అనడం అంటే చంద్రబాబుకు ఎక్కడో కాలినట్లు కాదా. మొత్తానికి జగన్ ముందు అంతా వణికిపోవాల్సిందే అన్న మాటలు కూడా బాబుకు చికాకు పెడతాయంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: