కరోనా వైరస్ కష్ట కాలంలో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా విద్యుత్ ఛార్జీలను నాలుగింతల పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిగే  నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ నిర్ణయంతో ఏకంగా ప్రతిపక్షాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలకు తిండి దొరక్క అల్లాడి పోతూ ఉంటే...  భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఎలా కడతారు అంటూ ప్రశ్నలు కురిపించారు. కరెంటు ముట్టుకోవడం కాదు కరెంట్ బిల్ ముట్టుకుంటే చాలు సామాన్య ప్రజల కు షాక్ కొట్టేలా ప్రస్తుతం అధికార పార్టీ నిర్ణయం ఉంది అంటూ ప్రతిపక్ష  నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

 


 అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగిపోయింది. అయితే గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా ఏకంగా ప్రజల  విద్యుత్  బిల్లులను చూసి వేల రూపాయల బిల్లు సామాన్య ప్రజలు ఎలా కడతారు అంటూ వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం చూస్తే అంతకుమించిన బిల్లులు ప్రస్తుతం సామాన్య ప్రజలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విద్యుత్ చార్జీలు పెంచినప్పటికీ  ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. 

 


 అయితే ప్రస్తుతం ఏబీసీ క్యాటగిరి ఆధారంగా బిల్లులు కేటయించటం  జరుగుతుంది అని జగన్ సర్కార్ చెప్పింది. అయితే జగన్ సర్కార్  చెప్పిన విధంగా ఏ బి సి క్యాటగిరి లో బిల్లులు వేస్తే  అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా గత నెల కు సంబంధించిన బిల్లును రద్దు చెస్తే  ప్రభుత్వం బాగుంటుంది అని  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఒక నెల బిల్లును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజల మనసులో నిలిచిపోతారు అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి జగన్ సర్కార్ దీనిపై ఎలా స్పందిస్తుంది అన్నది.22

మరింత సమాచారం తెలుసుకోండి: