గత కొన్ని రోజుల నుంచి నేపాల్ ప్రభుత్వం భారత్ పై  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ప్రబలుతున్న మొదట్లో... ఈ వైరస్ చైనా నుంచే వచ్చిందని భారత్ మాకు సహాయసహకారాలు అందిస్తోంది అంటూ తెలిపిన నేపాల్ సర్కార్... ప్రస్తుతం భిన్నమైన వ్యాఖ్యలు చేస్తోంది. చైనా నుంచి వస్తున్న వైరస్ కంటే ప్రస్తుతం భారత్ నుంచి వస్తున్న వైరస్ ప్రమాదకరంగా మారిపోయింది అంటూ వాక్యాలు చేయటం  సంచలనంగా మారిపోయింది. ఇతర దేశాల నుంచి నేపాల్ కు వస్తున్న వారి ద్వారా వ్యాపిస్తున్న వైరస్ ను  కంట్రోల్ చేయగలుగుతున్నాము  కానీ భారత్ వైరస్ ను  మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారూ  అంటూ నేపాల్ ప్రధాని వ్యాఖ్యానించారు. 

 

 అయితే ఇది వ్యాఖ్యలు  వెనుక అసలు కారణం ఏమిటి అంటే... నిపుణులు  భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు మాదకద్రవ్యాలు. కేవలం నేపాల్ గుండా మాత్రమే భారత్ లోకి వస్తున్నాయి... అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి భారత్  ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంను  ఈ విషయంపై ప్రశ్నించడంతో నేపాల్ ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానం చెప్పు కుంటూ వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ ఒక్కసారిగా అప్రమత్తమై అక్కడ టెర్రరిస్టులు మాదకద్రవ్యాలు అక్రమంగా చొరబడుతున్నా ప్లేస్  పటిష్టంగా భారత ఆర్మీ మోహరించడం చేసింది. వాస్తవంగా  అయితే భారత్ నుంచి అనేక సదుపాయాలను పొందుతూ ఉంటుంది నేపాల్ సర్కార్. కరోనా  వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ నేపాల్ కు ఎంతగానో సహాయం చేస్తుంది. 

 


 అయితే లడక్ లో యుద్ధవాతావరణం వచ్చేలా నేపాల్ చేస్తున్న ఇలాంటి సంచలన వ్యాఖ్యలను  చైనా వెనకుండి చేయిస్తుంది అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఒకప్పుడు భారత స్వతంత్రం వచ్చిన తర్వాత నేపాల్ భారతదేశంలో విలీనం అవుతామని చెప్పినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ వద్దని చెప్పిన ఘటన కూడా ప్రస్తుతం చర్చకు వస్తుంది. అయితే ప్రస్తుతం చైనా కావాలని నేపాల్ కు  అవసరం లేకుండా ఎక్కువ మోతాదులో అప్పులు  కల్పిస్తుందని అందువల్లే నేపాల్ ప్రభుత్వం భారత్ పై  విమర్శలకు దిగుతుంది అన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: