అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనం సృష్టిస్తున్నది మోదీ సర్కార్. గత 70 ఏళ్ల నుంచి ఎవరికీ సాధ్యం కానీ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ భూభాగాన్ని భారత్ కు చెందిన ఓ భాగంగా మార్చిన విషయం తెలిసిందే. ఎన్ని  విమర్శలు వచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆర్టికల్ 370 విషయంలో వెనక్కి తగ్గలేదు కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి కాశ్మీర్ ప్రాంతం మొత్తం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. కాశ్మీర్లో పురోగతి రోజురోజుకు పెరిగిపోతోంది. కాశ్మీర్ లోని అన్ని పంచాయతీలకు సక్రమంగా నిధులు వెళ్తుండటంతో అభివృద్ధి జరుగుతుంది. 

 

 ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ప్రాంతంలో శాశ్వత మార్పులు జరుపుతూ నిర్ణయం తీసుకుంది. అందులో మొదటిది పర్మినెంట్ రెసిడెన్సీ సర్టిఫికెట్.... ఈ సర్టిఫికెట్ తో పాటు ప్రస్తుతం ఆధార్ కార్డు కూడా అక్కడ ప్రజలకు ఇవ్వడం ప్రారంభించారు. అంతేకాకుండా పదిహేనేళ్ల నుంచి కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళు.. ఏడేళ్ల నుంచి జమ్మూకాశ్మీర్లో అక్కడే ఉండి చదువుకుంటున్న వారికి కూడా లోకల్ రెసిడెన్సి సర్టిఫికెట్ జారీ చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అంతే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్న కాశ్మీరు మాత్రం వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 

 

 అయితే అక్కడ ప్రతి ఒక్కరికీ ఓటు  ఓటుహక్కు ఉండేవిధంగా సిస్టమ్  మార్చేస్తున్నారు... ఇదివరకు ప్రభుత్వాలకు మాత్రమే ఆస్తి హక్కు ఉండేది... కానీ ప్రస్తుతం వ్యక్తిగతంగా ఎవరికి వారికి ఆస్థి హక్కు  ఉండేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే భారత దేశ వ్యాప్తంగా అందరూ ఎలాంటి విధి విధానాలను అవలంభిస్తారు.. అలాంటి వాటీనే  ప్రస్తుతం కాశ్మీరీలు కూడా అవలంభించనున్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పటికీ సత్వరంగా ఇవన్నీ చర్యలు చేపట్టడం కుదరదు కాబట్టి తాజాగా దీనికి  సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: