తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పై బెంగ, అధికార పార్టీ ఇస్తున్న భరోసాతో ఇప్పుడు ఒక్కొక్కరుగా వైసీపీ లోకి వచ్చి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వరకు టిడిపికి చెందిన నాయకులంతా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తరువాత చేరికలు ఇలా సాగుతుండగానే అకస్మాత్తుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం, ఆ తర్వాత కరోనా ప్రభావం ఎక్కువ అవడంతో నాయకుల చేరికకు వాయిదా పడింది. మరి కొంతమంది నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ తీర్థం పుచ్చుకుంటేనే బెటర్ అన్న ఆలోచనలో ఉండిపోయారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై సదరు నాయకులకు సందేహాలు పెరిగిపోతున్నాయి. 

IHG


రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సమస్య ఏర్పడే అవకాశం ఉండడంతో, ఇప్పుడు ఒక్కొక్కరుగా అధికార పార్టీ వైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారంతా అధికారికంగా పార్టీలో చేరకపోయినా, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసిపికి మద్దతుగా, స్వతంత్ర ఎమ్మెల్యే గా కొనసాగేందుకు సైతం ఇష్టపడుతున్నారు. ఈ విధంగానే ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి వచ్చి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ముఖ్య నాయకులు చాలా మంది వైసీపీ కండువా కప్పుకునేందుకు ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. 

IHG


మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తో పాటు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కుదిరితే ఈ నెల 27వ తేదీలోపు వైసీపీలో చేరాలని చూస్తున్నారట. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన అధికారికంగా వైసీపీలో చేరికపోయినా ఆయన కుమారుడు కరణం వెంకటేష్ ను వైసీపీ లో చేర్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా త్వరలోనే జగన్ ను కలిసి వైసీపీ కండువా కప్పుకో వాలని చూస్తున్నారట. వరుసగ టీడీపీ నాయకులు అందరినీ వైసీపీలో చేర్చుకొని రాజకీయంగా తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టేందుకు అన్ని జిల్లాల్లో టిడిపి కీలక నాయకులు అందరిని వైసీపీలో చేర్చుకోవాలని చూస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వైసీపీ ముఖ్య నాయకులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: