రాజకీయాలలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు మరియు జగన్ కలిసి ఆంధ్ర ప్రదేశ్ నీటి ప్రాజెక్టుల విషయంలో చేతులు కలపబోతున్నారు. కృష్ణా జలాల విషయం ఇటీవల 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో వైసీపీ పార్టీ నాయకులు చంద్రబాబు వైఖరి ఏంటో బయటపెట్టాలని మొన్నటి నుండి మీడియా ముందు తెగ మొత్తుకుంటున్నారు. అయినా గాని చంద్రబాబు పెద్దగా స్పందించలేదు. ఈ విషయం నడుస్తూ ఉండగానే దీన్ని డీల్ చెయ్యడం లో భాగంగా ఇటీవల మీడియా సమావేశంలో చంద్రబాబు స్పందించడం జరిగింది. రాయలసీమ ప్రాంతానికి మంచి జరుగుతుంది అంటే కచ్చితంగా తన సహకారం ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు.

 

ఇదే సమయంలో జగన్ సర్కార్ అవలంబిస్తున్న తీరుపై విమర్శలు కూడా కురిపించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో కర్నూలు ప్రాంతంలో దీక్ష చేసి కాలేశ్వరం కడితే ఇండియా- పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం వచ్చినట్లు అవుతుందని మాట్లాడారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చి కాలేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి వెళ్ళటాన్ని ఏమంటారు అంటూ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ మొదలు పెడితే తాను పూర్తిచేసినట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

 

అంతేకాకుండా రాయలసీమలో నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడాలంటే ఆ అధికారం, హక్కు ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో మొదలు పెట్టిన అనేక ప్రాజెక్టులు తన హయాంలో కంప్లీట్ అయ్యాయని చంద్రబాబు తెలిపారు. ఇటువంటి సమయంలో పోతిరెడ్డి ప్రాజెక్టు  విషయంలో చంద్రబాబు మరియు జగన్ తో కలిసి పని చేయడానికి పరోక్షంగా రెడీ అన్నట్టుగా బాబు చెప్పటంతో ఈ విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరొక పక్క పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నోరు విప్పటం తో అధికార పార్టీ నేతలు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: