జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ చిలికి చిలికి గాలివానలా మారే అవకాశం కనిపిస్తోంది. ''ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా.. కదా ? అనేది చర్చించదగిన విషయం. కానీ అతని వైపు ఆర్గ్యుమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే.. ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సంద ర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్'' అని నాగబాబు ట్వీట్ చేశారు.


ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అంటూ నాగబాబు చెప్పుకున్నా, ఈ విషయంలో జనసేన మీద దుమారం చెలరేగుతోంది. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీలోనే ఉండడంతో ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సింది కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ తరచుగా గాంధీజీ సిద్ధాంతాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. గాంధీజీ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన్నే రోల్ మోడల్ గా తీసుకుంటామంటూ చెప్పుకుంటూ ఉంటారు. అదీ కాకుండా బీజేపీ తో జనసేన ఇప్పుడు రాజకీయంగా పొత్తు పెట్టుకుంది. ఈ సమయంలో బీజేపీ నియమ నిబంధనలకు విరుద్ధంగా జనసేన పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నాయకులంతా గుర్రుగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ నాయకులు ఎవరూ దీనిపై స్పందించలేదు.

 


 ఇప్పటికే నాగబాబు గాడ్సే గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ పై తెలంగాణ లో కేసు కూడా నమోదయ్యింది. కానీ ఇప్పటి వరకు పవన్ ఈ విషయంపై స్పందించలేదు. కానీ బీజేపీ కి ఈ విషయంపై సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి పవన్ కు ఏర్పడింది. ఖచ్చితంగా ఈ విషయంపై బీజేపీ పవన్ వివరణ కోరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజకీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న జనసేన కు ఇది ఖచ్చితంగా చేటు తెచ్చే వ్యవహారంగా కనిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: