తెలుగుదేశం నేతలు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులను వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. చాలా చోట్ల 12 గంటల దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ దీక్షలకు ఓ ఎజెండా అంటూ ఏమీ లేకుండాపోయింది. ఎందుకంటే.. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నది తెలుగు దేశం ఆరోపణ. కానీ.. అవి రెండు నెలల బిల్లులు కదా అంటోంది సర్కారు. అయితే సర్కారు గుట్టుచప్పుడు కాకుండా కరెంట్ చార్జీలు పెంచేసిందని ప్రచారం చేస్తోంది.

 

 

ఏకంగా పెంచిన చార్జీలు తగ్గించాలంటూ ఉద్యమం చేస్తోంది. అయితే దీన్ని కొందరు సీనియర్ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీలోని విలక్షణ నేత.. మీడియాకు మిత్రుడు అయిన జేసీ దివాకర్ రెడ్డి కూడా ఈ దీక్షలను తప్పుబట్టారు. టీడీపీ నేతలు చేసే దీక్షలు వృధా అని తెలిపారు. ఎందుకు దీక్షలు చేస్తున్నారో టీడీపీ నేతలకే తెలియదని దివాకరరెడ్డి మండిపడ్డారు.

 

 

అంతే కాదు.. తరచూ జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసే దివాకర్ రెడ్డి ఈసారి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. జెసి దివాకరరెడ్డి ఈసారి ముఖ్యమంత్రి జగన్ ను మెచ్చుకోవడమే కాదు అదే సమయంలో టిడిపి దీక్షలను తప్పు పట్టారు. కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వడానికి జగన్ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని జేసీ మెచ్చుకున్నారట. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో తెచ్చిన సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారట

 

 

అంతే కాదు.. పోతిరెడ్డిపాడు కోసం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చాలా కృషి చేశారని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారట. ఇది నిజంగా చంద్రబాబుకు మంట పుట్టించే వ్యాఖ్యలే. ఎందుకంటే పోతిరెడ్డి పాడు తానే పూర్తి చేశానని ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జేసీ ఇలాంటి కామెంట్లు చేస్తే పాపం.. చంద్రబాబు ఏమైపోవాలి..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: