కరోనా వైరస్ కాస్త కంట్రోల్ లోకి రావడంతో వైసీపీ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత 3 నెలలు కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ప్రజలు, రాజకీయ నాయకులంతా ఇళ్లకు పరిమితం కావడంతో అధికారంలో ఉన్న పార్టీ నేతలు కరోనా వైరస్ నియంత్రించే కార్యక్రమంలో బిజీ అయ్యారు. అయితే ఇటీవల వైరస్ కొద్దిగా కంట్రోల్ లోకి రావడంతో మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా మళ్లీ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసినట్టు అర్థం అవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్ కి జై కొట్టడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో తాజాగా ఒక మాజీ మంత్రి మరియు ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే ఇద్దరు వైసీపీ పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా వరకు కొద్ది కొద్ది గా పట్టు నిలుపుకున్న టిడిపి జిల్లాలను జగన్ గట్టిగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాలో టిడిపి ఇక కనబడకూడదు అని ఆ జిల్లాలో టీడీపీకి అండగా ఉన్న మాజీ మంత్రి శిద్ధ రాఘవరావు అదేవిధంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులకు వైసీపీ వల విసిరింది. వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే వీరిద్దరి తో చర్చలు జరిగినట్లు, ఇద్దరూ కూడా వైసీపీ పార్టీలోకి రావడానికి రెడీ అవుతున్నట్లు వైసీపీ పార్టీలో టాక్.

 

మొత్తం అంతా ఓకే అయితే ఈ నెల 27 వ తారీఖున ఇద్దరు కలిసి జగన్ సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ రాకముందు ప్రకాశం జిల్లాలో కరణం బలరాం అయన కొడుకు కరణం వెంకటేష్ పార్టీ లో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి  శిద్ధా రాఘవరావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లు రావడం దాదాపు ఖరారు అయిపోయింది. ఈ దెబ్బతో పూర్తిగా ప్రకాశం జిల్లాలో జగన్ ప్లాన్ లో భాగంగా దాదాపు టిడిపి తుడిచిపెట్టుకుపోయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: