అధికారంలోకి రావటమే జగన్ పెద్దగా ఆర్భాటాలకు పోకుండా ఖర్చులు తగ్గించుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు. విభజనతో నష్టపోయి చంద్రబాబు హయాంలో ఆర్థికంగా చితికిపోయిన ఏపీ ఖజానా లో ఒక్కపైసా వృధా కాకుండా ప్రతిదీ ప్రజలకు చేరేలా పరిపాలన చేస్తున్నారు. పబ్లిసిటీ లకు పోకుండా ప్రభుత్వ పరంగా జరగాల్సిన కార్యక్రమాలకు తక్కువ ఖర్చులో కార్యక్రమాలు చేసుకుంటూ మరోపక్క అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. చెప్పిన విషయంలో అధికారులు ఏమాత్రం అలసత్వం కనబడిన చంద్రబాబు అధికారంలో లాగా సస్పెండ్ వంటివి చేయకుండా ఏకంగా బదిలీ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు మర్యాద ఇవ్వటం లో ఎంత శ్రద్ధ చూపుతున్నారో అదే సమయంలో పాలనాపరంగా నిర్లక్ష్యంగా పనిచేస్తే అధికారులను నెమ్మదిగా కట్ చేసే విషయంలో కూడా చాలా పదునైన ఆలోచనలతో జగన్ ముందుకు వెళ్తున్నారు.

 

ముందుగా అధికారంలోకి వచ్చిన సమయంలో చీఫ్ సెక్రెటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం తన నిర్ణయాల పట్ల చాలా చులకనగా నిర్లక్ష్యంగా వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవహరించడంతో వెంటనే చీఫ్ సెక్రటరీ అని చూడకుండా పక్కన పెట్టేశారు. ఈ మెసేజ్ తో అధికారులలో తన నిర్ణయాలు ఎలా ఉంటాయో జగన్ రుచి చూపించారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ అదేవిధంగా నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి నీ ఏ మాత్రం ఆలోచించకుండా సస్పెండ్ చేసి పడేసారు.

 

అదే సమయంలో సలహాదారుల విషయంలో కూడా పోలవరం ప్రాజెక్టు సాంకేతిక సలహాదారు హెచ్.కె. సాహు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆయనను పదవి నుంచి తప్పించారు. ఏడాదిలోనే జగన్ తన పరిపాలన కత్తి విధానం పదును ఏంటో ప్రభుత్వం పట్ల ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో సస్పెన్షన్లు బదిలీల ద్వారా ఏడాది కాలంలోనే చూపించారు. చాలా వరకు ప్రస్తుతం జగన్ ఆలోచనల పట్ల అధికార యంత్రాంగంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీంతో కత్తికి రెండు వైపులా పదును ఉండేవిధంగా కత్తిలాంటి నిర్ణయాలతో ఒకపక్క ప్రజలకు సంక్షేమ అందిస్తూ మరోపక్క అదే కత్తితో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను వైయస్ జగన్ కట్ చేసుకుంటూ పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: